Union Minister Rajeev Chandrasekhar: ఐబీఎం సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఎక్కడ ప్రారంభమైంది?
కర్ణాటక రాష్ట్ర రాజధాని నగరం బెంగళూరులో ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్(ఐబీఎం) ఏర్పాటు చేసిన ‘‘సైబర్ సెక్యూరిటీ కమాండ్ సెంటర్’’ ప్రారంభమైంది. ఫిబ్రవరి 23న కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కంపెనీలు ఏదైనా సైబర్ దాడికి గురైతే దాన్ని ప్రభుత్వానికి వెల్లడించాలన్న చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 10 కోట్ల సైబర్ దాడుల ఘటనలను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఇండియా సీఈఆర్‌టీ) గుర్తించినట్టు చెప్పారు. సైబర్ దాడుల పరంగా భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమని పేర్కొన్నారు.
ఆసియా పసిఫిక్‌లో మొదటి కేంద్రం..
బెంగళూరులో ఏర్పాటు చేసిన సెబర్ సెక్యూరిటీ కమాండ్ సెంటర్’’ భారతదేశంలోనే కాకుండా ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే తమ కంపెనీ మొదటి కేంద్రం అని ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ తెలిపారు. ఈ కేంద్రంలో సైబర్ భద్రత విషయంలో టెక్నిక్‌లపై శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ కేంద్రంలోనే కొత్త సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్త క్లయింట్లకు సెక్యూరిటీ రెస్పాన్స్ సేవలను అందించనున్నట్టు పేర్కొన్నారు. ఐబీఎం ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. ప్రస్తుతం దీని చైర్మన్, సీఈవోగా భారతీయ–అమెరికన్ అరవింద్ కృష్ణ ఉన్నారు.
చదవండి: మూడో పెద్ద స్టార్టప్ ఎకోసిస్టవ్‌గా ఆవిర్భవించిన దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐబీఎం ఏర్పాటు చేసిన ‘‘సైబర్ సెక్యూరిటీ కమాండ్ సెంటర్’’ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : ప్రపంచవ్యాప్త క్లయింట్లకు సైబర్ సెక్యూరిటీ రెస్పాన్స్ సేవలను అందించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్