ASHA Workers: ఆశాలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు.. ప్రస్తుతం వారి వేతనం ఎంతంటే..?
వారి సేవలను గుర్తించి రూ.9,750 వేతనం ఇస్తున్నట్లు చెప్పారు. ఇతర మహిళా ఉద్యోగులకు ఇస్తున్నట్లుగానే ఆశా కార్యకర్తలకు, సెకండ్ ఏఎన్‌ఎంలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేందుకు సమగ్ర అధ్యయనం చేసి నివేదిక అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతీలను మంత్రి ఆదేశించారు. ఆశాలు, ఏఎన్‌ఎంలతో నెలవారీ సమీక్షలో భాగంగా జూన్ 5న టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ జూన్ 14న తెలంగాణ వైద్య, ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ (07-13 మే 2023)
ప్రసవాల్లో ప్రభుత్వాసుపత్రులు టాప్..
ప్రభుత్వ ఆసుపత్రుల చరిత్రలోనే మన ఆసుపత్రులు ప్రసవాలు చేయడంలో రికార్డు సృష్టించాయని హరీశ్‌రావు అన్నారు. 69 శాతం ప్రసవాలతో ప్రభుత్వ ఆసుపత్రులు గణనీయమైన వృద్ధి సాధించాయన్నారు. 16 జిల్లాల్లో 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగటం గొప్ప విషయమన్నారు. అధిక ప్రసవాలు చేసిన సంగారెడ్డి, నారాయణ్ పేట్, మెదక్, జోగులాంబ గద్వాల జిల్లాలకు అభినందనలు తెలిపారు.
సి.. సెక్షన్లు అధికంగానూ, ఇతర అంశాల్లో పనితీరు తక్కువగా కనబరుస్తుతున్న కరీంనగర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాలని, మెటర్నిటీ విభాగం జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని వారం పాటు క్షేత్రస్థాయిలో పరిశీలనకు పంపి తగిన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఇమ్యూనైజేషన్ తక్కువగా నమోదవుతున్న సూర్యాపేట జిల్లాకు ఇమ్యూనైజేషన్ విభాగం జేడీని క్షేత్రస్థాయి పరిశీనలకు పంపాలని సూచించారు. కనిష్ట స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించిన 53 సబ్ సెంటర్లు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు.
Cyber Crimes: సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చట్టం..రాష్ట్ర ఐటీ శాఖ 2022–23 నివేదిక విడుదల