Andhra Pradesh: వైఎస్సార్ సంచార పశు వైద్య సేవలకు శ్రీకారం
తొలి విడతగా రూ.143 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన 175 అంబులెన్స్‌లను తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మే 19న జెండా ఊపి ప్రారంభించారు. 108, 104 అంబులెన్స్‌ల తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఈ మొబైల్ అంబులేటరీ క్లినిక్స్‌ను తీర్చిదిద్దారు. రెండో విడతలో రూ.135 కోట్లతో 165 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Integrated Renewable Energy Project: ప్రపచంలో తొలి సోలార్, విండ్, హైడల్ పవర్ ప్రాజెక్టు ఏది?
GK Important Dates Quiz: భారతదేశంలో జాతీయ టీకా దినోత్సవం 2022 ఎప్పుడు జరుపుకుంటారు?
సౌకర్యాలు ఇలా..
- ప్రతి అంబులెన్స్‌లో ట్రావిస్‌తో పాటు వెయ్యి కిలోల బరువున్న మూగ జీవాన్ని తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యం.
- 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రో స్కోప్‌తో కూడిన లేబరేటరీ.
- ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్న జీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు వీలుగా సౌకర్యాలు. అందుబాటులో సీజన్ వారీగా అవసరమైన వ్యాక్సిన్లు, అన్ని రకాల మందులు.
- ప్రతి వాహనంలో పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లమో చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్.
- టోల్ ఫ్రీ నంబర్ 1962కు ఫోన్ చేసి పశువు అనారోగ్య సమాచారం తెలియజేస్తే చాలు రైతు ముంగిటకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. అవసరమైతే సమీప పశు వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం చేయిస్తారు. పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఉచితంగా అదే అంబులెన్స్‌లో రైతు ఇంటికి భద్రంగా చేరుస్తారు.
Grid Dynamics: దేశంలో గ్రిడ్ డైనమిక్స్ మొదటి యూనిట్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ జిల్లాలో అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రిను నిర్మించారు?
Health Cloud: తొలి ఇంటిగ్రేటెడ్ వైద్య పరికరాల తయారీ కేంద్రం ఎక్కడ ఏర్పాటైంది?
GK Science & Technology Quiz:అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మొట్టమొదటి పూర్తి ప్రైవేట్ వ్యోమగామి మిషన్‌ను ప్రారంభించిన సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం
ఎప్పుడు : మే 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : తాడేపల్లి క్యాంప్ కార్యాలయం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : మూగ జీవాలకు వైద్య సేవలందించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్