Skip to main content

Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ తీసుకున్న‌ కీలక నిర్ణయాలు ఇవే.. డీఎస్సీ పోస్టుల భర్తీకి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఫిబ్ర‌వ‌రి 8వ తేదీన‌(బుధ‌వారం) జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
AP CM YS Jagan
AP CM YS Jagan Mohan Reddy

ఈ కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు.ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కల్యాణ మస్తులను మంత్రి వర్గం ఆమోదించింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్ బోర్డ్ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లక్షకు పైగా జాబ్స్‌

ప్రధానంగా 70 అజెండా అంశాలపై క్యాబినెట్‌ చర్చించింది. వైఎస్సార్‌ కల్యాణమస్తు పథకంలో గతం కంటే ఎక్కువ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలులో జాతీయ న్యాయ విద్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు.

AP YS Jagan : విద్యాశాఖపై సీఎం జగన్‌ కీలక స‌మావేశం.. జగనన్న విద్యాకానుకను..

ఏపీ కేబినెట్ తీసుకున్న‌ కీలక నిర్ణయాలు ఇవే..ap cm ys jagan mohan reddy cabinet meeting
☛ కర్నూలు జిల్లా డోన్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బోధనా సిబ్బంది నియామకానికి కేబినెట్‌ ఆమోదం
☛ ఈ నెల రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సీడీ చెల్లింపునకు కేబినెట్‌ ఆమోదం
☛ ఈ నెల 28న జగనన్న విద్యాదీవెన చెల్లింపునకు కేబినెట్‌ ఆమోదం
☛ 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థుల పోస్టుల భర్తీకి ఆమోదం
☛ డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
☛ విశాఖలో టెక్‌ పార్క్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
☛ నెల్లూరు బ్యారేజ్‌ను నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారేజ్‌గా మారుస్తూ నిర్ణయం
☛ రామాయపట్నం పోర్టులో 2 క్యాపిటివ్‌ బెర్త్‌ల నిర్మాణానికి ఆమోదం
☛ లీగల సెల్‌ అథారిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం
☛ పంప్‌ స్టోరేజ్‌ హైడ్రో ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులకు ఆమోదం

CM YS Jagan : విద్యాశాఖలోని పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌.. పూర్తి వివ‌రాలు ఇవే.. జూన్‌ నాటికి..

Published date : 08 Feb 2023 07:44PM

Photo Stories