AP Agriculture Budget 2022 Highlights: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2022–23
Andhra Pradesh Agriculture Budget 2022-23 Highlights: ప్రజల కడుపు నింపడానికి నిరంతరం కష్టించే రైతన్నలకు అండగా నిలబడటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విధానమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. పాలకుడు ప్రజా రంజకుడైతే ప్రకృతి హర్షిస్తుంది.. వర్షిస్తుందన్నారు. వ్యవసాయం వర్ధిల్లాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. 33 నెలల్లోనే వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. గతేడాది కంటే మిన్నగా వ్యవసాయం, అనుబంధ శాఖలకు రూ.43,052.78 కోట్ల కేటాయింపులతో 2022–23 వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు మార్చి 11న శాసనసభలో ప్రవేశపెట్టి మాట్లాడారు. ఇక శాసన మండలిలో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు.. వ్యవసాయ బడ్జెట్‌ను చదివి వినిపించారు.
మొత్తం బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ ఇలా..(రూ.కోట్లలో) |
|||
ఆర్థిక సంవత్సరం |
మొత్తం బడ్జెట్ |
వ్యవసాయ బడ్జెట్ |
శాతం |
2019–20 |
2,27,974.99 |
28,866.23 |
12.66 |
2020–21 |
2,24,289.18 |
29,159.97 |
12.97 |
2021–22 |
2,29,779.27 |
31,256.35 |
13.60 |
2022–23 |
2,56,257 |
43,052.78 |
16.80 |
వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రధాన కేటాయింపులు (రూ.కోట్లలో..) |
|
వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ |
7,020 |
వైఎస్సార్–పీఎం ఫసల్ బీమా |
1,802.04 |
ప్రకృతి విపత్తుల సహాయనిధి |
2,000 |
రాష్ట్రీయ కృషి వికాస యోజన(ఆర్‌కేవీవై) |
1,750 |
కృషియోన్నతి యోజన |
760 |
వైఎస్సార్ ఉచిత పంట రుణాల వడ్డీ రాయితీ |
500 |
రాయితీపై విత్తన సరఫరా |
200 |
కేఎఫ్‌డబ్ల్యూ జర్మనీ–జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ (జెడ్‌బీఎన్‌ఎఫ్) |
87.27 |
వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ |
50 |
ఎరువుల బఫర్ స్టోరేజ్ |
40 |
రైతు భరోసా కేంద్రాలు |
18 |
ధరల స్థిరీకరణ నిధి |
500 |
వ్యవసాయ మార్కెట్ మౌలిక సదుపాయాల నిధి (ఎఎంఐఎఫ్) |
100 |
మత్స్య యూనివర్సిటీ భవనాలకు |
40 |
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ |
100 |
ఫాడర్ అండ్ ఫీడ్ డెవలప్‌మెంట్ |
72.70 |
పశు నష్టపరిహారం |
50 |
ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన (పీఎంఎంఎస్‌వై) |
100 |
ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్/జెట్టీలు |
100 |
మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రాయితీ |
50 |
వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా |
120.49 |
వైఎస్సార్ రైతు భవనాలు |
52 |
వైఎస్సార్ పొలంబడులు |
30 |
రైతులకు ఎక్స్‌గ్రేషియా |
20 |
వ్యవసాయ డ్రోన్లు |
200 |
ఫుడ్ ప్రాసెసింగ్ |
146.41 |
సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం |
160 |
ఆచార్య ఎన్‌జీ రంగా వర్సిటీ |
421.15 |
వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ |
59.91 |
శ్రీ వెంకటేశ్వర పశు వర్సిటీ |
122.50 |
పాడిపశువులు, మేకలు, గొర్రెల కొనుగోలు (41,304 యూనిట్లు) |
309.78 |
మినీ గోకులాలు |
26.25 |
పులివెందుల ముర్రాజాతి గేదెల పునరుత్పత్తి కేంద్రం |
22.18 |
పశుసంవర్ధక శాఖలో మౌలిక సదుపాయాల కల్పన |
27 |
వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకం |
5000 |
వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం |
8,328.89 |
వైఎస్సార్ జలకళ |
50 |
మార్కెటింగ్ శాఖ |
614.23 |
సహకార శాఖ |
248.45 |
ఉద్యాన శాఖ |
554.04 |
పట్టు పరిశ్రమ |
98.99 |
పశుసంవర్ధక శాఖ |
1,027.82 |
మత్స్యశాఖ |
337.23 |
నీటి పారుదల రంగం |
11,482.37 |
పథకాల వారీగా కేటాయింపులు.. (రూ.కోట్లలో) |
|||
పథకం |
ఆర్థిక సంవత్సరం |
||
పథకం |
2020–21 |
2021–22 |
2022–23 |
వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ |
6,928 |
6,876.50 |
7,020 |
ఉచిత విద్యుత్ పథకం |
4,450 |
5,000 |
5,000 |
ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి |
2,000 |
2,000 |
2,000 |
ఉపాధితో వ్యవసాయరంగఅనుసం««ధానం |
6,270 |
8,116.16 |
8,328.89 |
వైఎస్సార్ ఉచిత పంటల బీమా |
500 |
1,802.82 |
1,802 |
రాయితీ విత్తనాల పంపిణీ |
50 |
100 |
200 |
వైఎస్సార్ పశునష్టపరిహారం |
50 |
50 |
50 |
ప్రకృతి వ్యవసాయం |
225.51 |
311.62 |
200 |
ఏపీ ఎన్‌జీ రంగా వ్యవసాయవర్సిటీ |
402 |
359.76 |
421.15 |
వైఎస్సార్ ఉద్యానవర్సిటీ |
88.60 |
69.91 |
59.91 |
శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం |
122.73 |
147.30 |
122.50 |
జలవనరుల శాఖకు రూ.11,482.37 కోట్లు
సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడానికి ప్రణాళిక రచించిన ప్రభుత్వం.. ఆ మేరకు వాటిని పూర్తి చేయడానికి కావాల్సిన నిధులను బడ్జెట్‌లో ప్రతిపాదించింది. 2022–23 వార్షిక బడ్జెట్‌లో జలవనరుల శాఖకు రూ. 11,482.37 కోట్లను కేటాయించింది.
2022–23 బడ్జెట్‌లో ప్రాజెక్టుల వారీగా నిధుల కేటాయింపులు ఇలా |
|
ప్రాజెక్టు పేరు |
కేటాయింపు(రూ.కోట్లలో) |
సోమశిల |
88.76 |
పెన్నా కాలువల వ్యవస్థ(నెల్లూరు, సంగం బ్యారేజీలు) |
100.00 |
తెలుగుగంగ |
540.23 |
గాలేరు–నగరి |
438.05 |
పులివెందుల బ్రాంచ్ కెనాల్ |
238.83 |
నేరడి బ్యారేజీ(వంశధార స్టేజ్–2) |
103.83 |
తోటపల్లి |
126.61 |
తారకరామతీర్థసాగరం |
124.50 |
వెలిగొండ |
856.15 |
గుండ్లకమ్మ |
30.00 |
పాలేరు రిజర్వాయర్ |
5.00 |
తుంగభద్ర హెచ్చెల్సీ |
67.46 |
తుంగభద్ర ఎల్లెల్సీ |
22.00 |
హంద్రీ–నీవా |
148.13 |
పోలవరం |
4,163.10 |
తాటిపూడి ఎత్తిపోతల |
50.00 |
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి |
297.50 |
పురుషోత్తపట్నం ఎత్తిపోతల |
20.00 |
కేసీ కెనాల్ |
74.65 |
ఎస్సార్బీసీ |
55.74 |
గురురాఘవేంద్ర ఎత్తిపోతల |
22.82 |
వరదరాజగుడి స్వామి ప్రాజెక్టు |
10.35 |
గోదావరి డెల్టా వ్యవస్థ |
65.10 |
కృష్ణా డెల్టా |
55.00 |
చింతలపూడి ఎత్తిపోతల |
487.00 |
చిన్ననీటిపారుదల |
294.17 |
తుంగభద్ర బోర్డు |
157.63 |
మంత్రి కన్నబాబు ప్రసంగం – ముఖ్యాంశాలు
- కేంద్ర ప్రభుత్వం రెండేళ్లకు ఒకసారి ప్రకటించే గుడ్ గవర్నెన్స్ సూచీ–2021లో దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీ మొదటి స్థానంలో ఉంది.
- వ్యవసాయ రంగంలో ఏపీ నంబర్ 1 స్థానంలో ఉందని ‘స్కోచ్’ ఇటీవల విడుదల చేసిన సర్వేలో వెల్లడైంది. కోవిడ్ కష్టకాలంలో రైతు వెన్నంటే నిలిచి సాయం అందించడం వల్లే ఇది సాధ్యమైంది.
- ఇటీవలే 13 ఆర్బీకేలకు ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. మిగిలిన కేంద్రాలు కూడా అదే బాటలో ఉన్నాయి. ఆర్బీకేలను బ్యాంకింగ్ సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాం. దశలవారీగా ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నాం. సహకార సేవలను ఆర్బీకేలతో అనుసంధానం చేస్తున్నాం.
- పురుగు మందులు, ఎరువుల నుంచి విత్తనాలు వెదజల్లే వరకు డ్రోన్లతో చేపడితే వినియోగ పరిమాణం తగ్గుతుంది. ఆర్బీకేల ద్వారా 10 వేల డ్రోన్లను దశల వారీగా రాయితీపై సరఫరా చేయడంతోపాటు నిర్వహణపై గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా 20 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
- రైతులపై రూపాయి భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం. పాత బకాయిలు కలిపి ఇప్పటి వరకు రూ.3707 కోట్లు చెల్లించాం.
- రూ.2 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ప్రకృతి విపత్తుల నిధి ద్వారా ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం ఇస్తున్నాం.
- కల్తీలేని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాం. 33 విత్తన శుద్ధి కర్మాగారాలను 2022 ఏడాది అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
- రైతుల కోసం జిల్లాకొకటి చొప్పున త్వరలో ఏర్పాటు కానున్న 26 జిల్లాల్లో 26 వైఎస్సార్ రైతు భవన్ పేరిట భవనాల నిర్మాణానికి రూ.52 కోట్లు వెచ్చిస్తాం.
- ఆర్బీకేలకు అనుబంధంగా 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు, 1,615 కోత యంత్రాలతో కూడిన క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 3,672 గ్రామ స్థాయి, 85 క్లస్టర్ స్థాయి కేంద్రాలు నెలకొల్పాం. వీటి కోసం రూ.853.50 కోట్లు కేటాయించాం.
- ఐదేళ్లలో 5 లక్షల ఎకరాల్లో చిరుధాన్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో త్వరలో చిరుధాన్యాల సమగ్ర సాగు వి«ధానాన్ని తెస్తున్నాం.
- వసాయ అనుబంధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.16 వేల కోట్లతో వైఎస్సార్ వ్యవసాయ మౌలిక సదుపాయాల మిషన్ ఏర్పాటు చేశాం.
- మార్క్‌ఫెడ్‌ను నష్టాల నుంచి తప్పించి మరింత నాణ్యతతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ మార్కప్ పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశాం.
- డీసీసీబీల్లో హెర్‌ఆర్ పాలసీ తెచ్చి పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణకు రూ.89.54 కోట్లు ఖర్చు చేస్తున్నాం. డీసీసీబీ, ఆప్కాబ్‌లకు రూ.295 కోట్లు మూలధనాన్ని అందిస్తున్నాం. పీఎసీఎస్‌లకు అదనపు ఆదాయం తెచ్చిపెట్టే లక్ష్యంతో 103 పెట్రోల్ బంక్‌లను ఈ ఏడాది ఏర్పాటు చేస్తున్నాం.
- 11,711 గ్రామాల్లో ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు, 4796 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. వీటి భవనాల నిర్మాణం రూ.2,623కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1361 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
- పశుగ్రాస భద్రతా పథకంలో భాగంగా గతేడాది రూ.238.31కోట్లతో 28,487 ఎకరాల్లో పశుగ్రాసం పెంచాం. మరో 20 వేల ఎకరాల్లో బహువార్షిక పశుగ్రాస క్షేత్రాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం.
- దేశంలో తొలిసారిగా టెలిమెడిసిన్ ద్వారా పశువైద్య సేవల కోసం విజయవాడలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం.
- రూ.249 కోట్లతో 340 సంచార పశు వైద్యశాలలను ఏర్పాటు చేస్తున్నాం.
- పులివెందులలో పుంగనూరు ఆవుల సంరక్షణ పథకానికి రూ.69.36 కోట్లు కేటాయించాం.
- ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు కోసం రూ.3 వేల కోట్లతో ప్రణాళికను ఆమోదించాం.
- ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ ఇచ్చేందుకు రూ.2,290 కోట్లు ఖర్చు చేశాం.
- దేశంలోనే ఉత్తమ ఉద్యానవన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. గత ఏడాది 94,571 మెట్రిక్ టన్నుల అరటిని ఎగుమతి చేయగా అరటిహబ్‌గా పులివెందుల నిలిచింది.
- డ్రాగన్ ఫ్రూట్, తైవాన్ జామ, మారిçషస్ రకం అనాస, స్ట్రాబెర్రీ లాంటి వైవిధ్య భరితమైన పంటలను 62,271 హెక్టార్లలో సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
- 11,250 హెక్టార్లలో మామిడి, జీడిమామిడి, పసుపు, మిర్చి, కూరగాయల సాగు ద్వారా సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సహిస్తున్నాం.
- 13,500 హెక్టార్లలో ఆయిల్ పామ్ విస్తరణకు చర్యలు తీసుకున్నాం.
చదవండి: Andhra Pradesh Budget 2022 Highlights >> ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022–23