Andhra Pradesh Budget 2022-23 Highlights: రూ. 11,387.69 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి కన్నబాబు
Sakshi Education
Andhra Pradesh Agriculture Budget 2022-23 Highlights: ఆంధప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2022-23లో భాగంగా వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు శాసనసభలో ప్రవేశపెట్టారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోందన్న మంత్రి కన్నబాబు.. రాయితీలతో పాటు నాణ్యత అందించే విషయంలో ఎక్కడా తగ్గకుండా ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం కోసం వార్షిక బడ్జెట్‌లో రూ. 11,387.69 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మార్కెటింగ్ యార్డుల్లో నాడు-నేడు, మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి 614.23 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే సహకార శాఖకు రూ. 248.45 కోట్లు, ఆహార శుద్ధి విభాగానికి 146.41 కోట్లు, ఉద్యానశాఖకు 554 కోట్లు, పట్టు పరిశ్రమకు 98.99 కోట్లు కేటాయించినట్లు వివరించారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం వ్యవసాయ బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా..
- ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 421.15 కోట్లు
- వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 59.91 కోట్లు
- వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి 122.50 కోట్లు
- పశు సంవర్ధక శాఖకు 1027.82 కోట్లు
- మత్స్య శాఖ అభివృద్ధి కోసం రూ. 337.23 కోట్లు
- వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 5000 కోట్లు
- వైఎస్సార్ జలకళకు 50 కోట్లు
- నీటి పారుదల రంగానికి 11450.94 కోట్లు
Published date : 11 Mar 2022 01:06PM