Skip to main content

Kurasala Kannababu: ఏ దేశ సహకారంతో రాష్ట్రంలో ఆగ్రో రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు కానుంది?

Kannababu

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో ఆగ్రో ఎకలాజికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు కానుంది. జర్మనీ సహకారంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని సెప్టెంబర్‌ 22న ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం... వ్యవసాయ రంగంలో మరింత నాణ్యమైన పరిశోధనలు, సిబ్బందికి పూర్తి స్థాయిలో సాంకేతిక అవగాహన కోసం ఏర్పాటు చేస్తున్న ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు... రూ.170 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు జర్మనీ అంగీకరించింది. 2022, ఏప్రిల్‌ నుంచి తరగతులు నిర్వహించనున్నారు. ప్రకృతి సేద్యంపై పరిశోధనలతో పాటు వ్యవసాయ సిబ్బందికి సాంకేతిక శిక్షణ అందించడమే ఈ సెంటర్‌ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం.

చ‌ద‌వండి: ఎగుమతిదారుల కోసం ఎక్స్‌పోర్ట్‌ ట్రేడ్‌ పోర్టల్‌ను రూపొందించిన రాష్ట్రం?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జర్మనీ సహకారంతో ఆగ్రో ఎకలాజికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 22
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం
ఎక్కడ    : పులివెందుల, వైఎస్సార్‌ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం
ఎందుకు : వ్యవసాయ రంగంలో మరింత నాణ్యమైన పరిశోధనలు, సిబ్బందికి పూర్తి స్థాయిలో సాంకేతిక అవగాహన కోసం...

Published date : 23 Sep 2021 04:05PM

Photo Stories