Skip to main content

Vanijya Utsav-2021: ఎగుమతిదారుల కోసం ఎక్స్‌పోర్ట్‌ ట్రేడ్‌ పోర్టల్‌ను రూపొందించిన రాష్ట్రం?

Vanijya Utsav-2021

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా రెండు రోజుల ట్రేడ్‌ కార్నివాల్‌ ‘వాణిజ్య ఉత్సవ్‌–2021’ ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 21న విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వాణిజ్య సదస్సును ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికను విడుదల చేయడంతో పాటు ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్స్‌పోర్ట్‌ ట్రేడ్‌ పోర్టల్, వైఎస్సార్‌ ఏపీ వన్‌ బిజినెస్‌ అడ్వైజరీ సర్వీసులను బటన్‌ నొక్కి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.

కేంద్ర వాణిజ్యశాఖతో కలిసి...

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర వాణిజ్యశాఖతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ వాణిజ్య ఉత్సవ్‌ను నిర్వహిస్తోంది. సెప్టెంబర్‌ 22వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ దేశాల దౌత్యాధికారులు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటున్నారు. వాణిజ్య ఉత్సవ్‌ అనంతరం నాలుగు రోజులపాటు జిల్లాల్లో కూడా వాణిజ్య సదస్సులు జరుగుతాయని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు.

చ‌ద‌వండి: రాష్ట్రంలో దుస్తుల తయారీ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్న సంస్థ?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : వాణిజ్య ఉత్సవ్‌–2021 ప్రారంభం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 21
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
ఎక్కడ    : విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను పెంచేందుకు...

 

Published date : 22 Sep 2021 04:30PM

Photo Stories