Skip to main content

Andhra Pradesh Budget 2022-23 Highlights: రూ. 2,56,256 కోట్లతో బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టిన మంత్రి బుగ్గన‌

Andhra Pradesh Budget 2022-23 Highlights: 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మార్చి 11న శాస‌న‌స‌భ‌లో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,56,257 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి చెప్పారు.
Buggana

తిరువళ్వార్‌ సూక్తులతో బడ్జెట్‌ ప్రసంగం మొదలుపెట్టిన మంత్రి బుగ్గన.. మధ్యమధ్యలో గురజాడ అప్పారావు, శ్రీశ్రీ కవితలను చదివి వినిపించారు. విపత్తును ఎదుర్కొన్నప్పుడే మన సామర్థ్యం తెలుస్తుందన్న ఆర్థిక మంత్రి.. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన పలు నివేదికల్లో ఏపీకి దక్కిన ఘనత గురించి వివరించారు. సంక్షేమ పథకాల సమర్థవంతంగా అమలు చేయడం.. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రెండింతలు కేటాయింపులు పెంచినట్లు తెలిపారు. కరోనాలాంటి మహమ్మారిని ఎదుర్కొంటూ.. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం సమర్థవంతంగా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించిందని మంత్రి బుగ్గన గుర్తు చేశారు.
ఇక 2022-23 వార్షిక బడ్జెట్‌ రూ. 2,56,256 కోట్లు గా పేర్కొన్న మంత్రి బుగ్గన.. రెవెన్యూ వ్యవయం రూ. 2, 08, 261 కోట్లు, మూల ధన వ్యవయం రూ. 47, 996 కోట్లు,  రెవెన్యూ లోటు రూ. 17, 036 కోట్లు,  ద్రవ్య లోటు రూ. 48, 724 కోట్లు, జీఎస్‌డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతంగా బడ్జెట్‌లో పొందుపర్చారు. 

ఏపీ బడ్జెట్‌లో  పలు ముఖ్యమైన కేటాయింపులు

  • వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ. 18 వేల కోట్లు కేటాయింపు
  • వైఎస్సార్‌ రైతు భరోసా రూ. 3,900 కోట్లు కేటాయింపు
  • పాల ఉత్పత్తి, పశుసంవర్ధక శాఖ, మత్యశాఖకు రూ.1568 కోట్లు
  • ఉన్నత విద్యకు రూ. 2,014 కోట్లు కేటాయింపు
  • ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ. 10, 201 కోట్లు కేటాయింపు
  • వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రెండింతలు కేటాయింపులు పెంపు
  • వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రూ. 20,962 కోట్లు
  • వ్యవసాయం మార్కెటింగ్‌, సహకారశాఖకు రూ. 11,387 కోట్లు

పలు విభాగాల కేటాయింపులు

  • వ్యవసాయం: రూ. 11,387.69 కోట్లు.
  • పశుసంవర్ధకం: రూ. 1568.83 కోట్లు.
  • బీసీ సంక్షేమం: రూ. 20,962.06 కోట్లు
  • పర్యావరణ, అటవీ: రూ. 685.36 కోట్లు.
  • ఉన్నత విద్య: రూ. 2,014.30 కోట్లు.
  • విద్యుత్: రూ. 10,281.04 కోట్లు.
  • సెకండరీ ఎడ్యుకేషన్: రూ. 27,706.66 కోట్లు.
  • ఎకానమికల్ బ్యాక్ వర్డ్: రూ. 10,201.60 కోట్లు.
  • సివిల్ సప్లైస్: రూ. 3,719.24 కోట్లు.
  • ఫైనాన్స్: రూ. 58,583.61 కోట్లు
  • జీఏడీ: రూ. 998.55 కోట్లు.
  • సచివాలయ వ్యవస్థ: రూ. 3,396.25 కోట్లు

వ్యవసాయ అనుబంధ రంగాలుః రూ. 13, 630.10 కోట్లు

  • ఇంధన రంగంః రూ. 10, 281.04 కోట్లు
  • జనరల్ ఎకో సర్వీసెస్-రూ. 4,420. 07 కోట్లు
  • ఇండస్ట్రీ అండ్ మినరల్స్- రూ. 2,755. 17 కోట్లు
  • ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్-రూ. 11, 482.37 కోట్లు
  • గ్రామీణాభివృద్ధి- రూ. 17, 109.04 కోట్లు
  • సైన్స్ అండ్ టెక్నాలజీ- రూ. 11.78 కోట్లు
  • ట్రాన్స్ పోర్టుః రూ. 9, 617. 15 కోట్లు
  • మొత్తంగా ఆర్థిక సేవల రంగానికిః రూ. 69, 306. 74 కోట్లు( బడ్జెట్ లో  27.5 శాతం)


సామాజిక సేవారంగంలో కేటాయింపులు:

  •  విద్యకు-రూ. 30, 077 కోట్లు
  •  హౌసింగ్- రూ. 4,791.69 కోట్లు
  •  లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ః రూ. 1,033.86 కోట్లు
  •  వైద్యం-రూ. 15, 384.26 కోట్లు
  •  సామాజిక భద్రత మరియు సంక్షేమంః రూ. 4,331. 85 కోట్లు
  •  క్రీడలు, యువత -రూ. 140.48 కోట్లు
  •  సాంకేతిక విద్య- రూ. 413.5 కోట్లు
  • పట్టణాభివృద్ధి- రూ. 8,796 కోట్లు
  •  తాగునీరు, పారిశుధ్యంః రూ. 2, 133.63 కోట్లు
  •  సంక్షేమంః రూ. 45,955 కోట్లు - గతేడాది రూ. 27, 964 కోట్లు
  • మొత్తంగా సామాజిక సేవా రంగాల కోసంః రూ. 1,13,340.20 కోట్లు(మొత్తంగా బడ్జెట్ లో 
  • సామాజిక సేవా రంగానికి 44. 23 శాతం)
  • ఇవికాకుండా, సాధారణ సేవలకు రూ. 73, 609.63 కోట్లు

Published date : 11 Mar 2022 11:43AM

Photo Stories