Andhra Pradesh Budget 2022-23 Highlights: ఈబీసీల సంక్షేమం రూ. 6,639 కోట్లు
Sakshi Education
Andhra Pradesh Budget 2022-23 Highlights: 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మార్చి 11న శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,56,257 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి చెప్పారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. తాజా బడ్జెట్‌లో ఈబీసీల సంక్షేమం కోసం రూ. 6,639 కోట్లు కేటాయించారు. మరికొన్ని కేటాయింపులు ఇలా..
మొత్తం బడ్జెట్ - రూ. 2,56,256 కోట్లు
- రెవెన్యూ వ్యయం - రూ. 2,08,261 కోట్లు
- మూలధన వ్యయం - రూ. 47,996 కోట్లు
- రెవెన్యూ లోటు - రూ. 17,036 కోట్లు
- ద్రవ్యలోటు - రూ. 48,724 కోట్లు
- వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,900 కోట్లు
- వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం రూ. 18 వేల కోట్లు
- ఎస్సీ సబ్ ప్లాన్ రూ. 18,518 కోట్లు
- ఎస్టీ సబ్ ప్లాన్ రూ. 6,145 కోట్లు
- బీసీ సబ్ ప్లాన్ రూ. 29,143 కోట్లు
- బీసీ సంక్షేమం రూ. 20,962 కోట్లు
- మైనార్టీ యాక్షన్ ప్లాన్ రూ. 3,532 కోట్లు
- ఈబీసీల సంక్షేమం రూ 6,639 కోట్లు
- సోషల్ వెల్ఫేర్ 12,728 కోట్లు
- ఈడబ్ల్యూఎస్ రూ. 10,201 కోట్లు
పలు రంగాలకు కేటాయింపులు
- వ్యవసాయం: రూ. 11,387.69 కోట్లు.
- వైద్య శాఖ 15,384 కోట్లు
- పశుసంవర్ధకం: రూ. 1568.83 కోట్లు.
- బీసీ సంక్షేమం: రూ. 20,962.06 కోట్లు
- రోడ్లు, భవనాల శాఖ రూ. 8,581 కోట్లు
- పర్యావరణ, అటవీ: రూ. 685.36 కోట్లు.
- ఉన్నత విద్య: రూ. 2,014.30 కోట్లు.
- విద్యుత్: రూ. 10,281.04 కోట్లు.
- సెకండరీ ఎడ్యుకేషన్: రూ. 27,706.66 కోట్లు.
- ఎకానమికల్ బ్యాక్ వర్డ్: రూ. 10,201.60 కోట్లు.
- సివిల్ సప్లైస్: రూ. 3,719.24 కోట్లు.
- ఫైనాన్స్: రూ. 58,583.61 కోట్లు
- జీఏడీ: రూ. 998.55 కోట్లు.
- సచివాలయ వ్యవస్థ: రూ. 3,396.25 కోట్లు
- మహిళా శిశు సంక్షేమం రూ. 4,382 కోట్లు
- క్రీడల శాఖ రూ. 290 కోట్లు
- పరిశ్రమల శాఖ రూ. 2,755 కోట్లు
- హోంశాఖ 7,586 కోట్లు
సంక్షేమ పథకాల అమలు కోసం..
- వైఎస్సార్ పెన్షన్ కానుక -రూ. 18 వేల కోట్లు
- వైఎస్సార్ రైతు భరోసా -రూ. 3, 900 కోట్లు
- జగనన్న విద్యా దీవెన -రూ. 2, 500 కోట్లు
- జగనన్న వసతి దీవెన -రూ. 2, 083 కోట్లు
- వైఎస్సార్-పీఎం ఫసల్ బీమా యోజన-రూ. 1, 802 కోట్లు
- వైఎస్సార్ స్వయంసహకార సంఘాల(గ్రామీణ) ఉచిత వడ్డీరహిత రుణాలు రూ. 600 కోట్లు
- వైఎస్సార్ స్వయంసహకార సంఘాల(అర్బన్) ఉచిత వడ్డీరహిత రుణాలు రూ. 200 కోట్లు
- వైఎస్సార్ వడ్డీ రహిత రైతు రుణాలు-రూ. 500 కోట్లు
- వైఎస్సార్ కాపు నేస్తం -రూ. 500 కోట్లు
- వైఎస్సార్ జగనన్న చేదోడు-రూ. 300 కోట్లు
- వైఎస్సార్ వాహన మిత్ర-రూ. 260 కోట్లు
- వైఎస్సార్ నేతన్న నేస్తం- రూ. 199 కోట్లు
- వైఎస్సార్ మత్స్యకార భరోసా-రూ. 120.49 కోట్లు
- మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ-రూ. 50 కోట్లు
- రైతుల ఎక్స్‌గ్రేషియా-రూ. 20కోట్లు
- లా నేస్తం- రూ. 15 కోట్లు
- జగనన్న తోడు-రూ. 25 కోట్లు
- ఈబీసీ నేస్తం రూ. 590 కోట్లు
- వైఎస్సార్ ఆసరా - రూ. 6, 400 కోట్లు
- వైఎస్సార్ చేయూత-రూ. 4, 235 కోట్లు
- అమ్మ ఒడి-రూ. 6, 500 కోట్లు
సామాజిక సేవారంగంలో కేటాయింపులు:
- విద్యకు-రూ. 30, 077 కోట్లు
- హౌసింగ్- రూ. 4,791.69 కోట్లు
- లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ః రూ. 1,033.86 కోట్లు
- వైద్యం-రూ. 15, 384.26 కోట్లు
- సామాజిక భద్రత మరియు సంక్షేమంః రూ. 4,331. 85 కోట్లు
- క్రీడలు, యువత -రూ. 140.48 కోట్లు
- సాంకేతిక విద్య- రూ. 413.5 కోట్లు
- పట్టణాభివృద్ధి- రూ. 8,796 కోట్లు
- తాగునీరు, పారిశుధ్యం- రూ. 2, 133.63 కోట్లు
- సంక్షేమం- రూ. 45,955 కోట్లు - గతేడాది రూ. 27, 964 కోట్లు
- మొత్తంగా సామాజిక సేవా రంగాల కోసంః రూ. 1,13,340.20 కోట్లు
- (మొత్తంగా బడ్జెట్ లో సామాజిక సేవా రంగానికి 44. 23 శాతం)
- ఇవికాకుండా, సాధారణ సేవలకు రూ. 73, 609.63 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలుః రూ. 13, 630.10 కోట్లు
- ఇంధన రంగంః రూ. 10, 281.04 కోట్లు
- జనరల్ ఎకో సర్వీసెస్-రూ. 4,420. 07 కోట్లు
- ఇండస్ట్రీ అండ్ మినరల్స్- రూ. 2,755. 17 కోట్లు
- ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్-రూ. 11, 482.37 కోట్లు
- గ్రామీణాభివృద్ధి- రూ. 17, 109.04 కోట్లు
- సైన్స్ అండ్ టెక్నాలజీ- రూ. 11.78 కోట్లు
- ట్రాన్స్ పోర్టుః రూ. 9, 617. 15 కోట్లు
- మొత్తంగా ఆర్థిక సేవల రంగానికిః రూ. 69, 306. 74 కోట్లు( బడ్జెట్ లో 27.5 శాతం)
Published date : 11 Mar 2022 12:18PM