Andhra Pradesh Budget 2022-23 Highlights: వైఎస్సార్ పెన్షన్ కానుకకు రూ. 18 వేల కోట్లు
Sakshi Education
Andhra Pradesh Budget 2022-23 Highlights: 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మార్చి 11న శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,56,257 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి చెప్పారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. తాజా బడ్జెట్‌లో వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి రూ. 18 వేల కోట్లు కేటాయించారు. మరికొన్ని కేటాయింపులు ఇలా..
- వైఎస్సార్ పెన్షన్ కానుక రూ. 18 వేల కోట్లు
- వైఎస్సార్ రైతు భరోసా రూ. 3, 900 కోట్లు
- జగనన్న విద్యా దీవెన రూ. 2, 500 కోట్లు
- జగనన్న వసతి దీవెన రూ. 2, 083 కోట్లు.
- వైఎస్సార్-పీఎం ఫసల్ బీమా యోజన రూ. 1, 802 కోట్లు
- వైఎస్సార్ స్వయంసహకార సంఘాల(గ్రామీణ) ఉచిత వడ్డీరహిత రుణాలు రూ. 600 కోట్లు
- వైఎస్సార్ స్వయంసహకార సంఘాల(అర్బన్) ఉచిత వడ్డీరహిత రుణాలు రూ. 200 కోట్లు
- వైఎస్సార్ వడ్డీ రహిత రైతు రుణాలు రూ. 500 కోట్లు
- వైఎస్సార్ కాపు నేస్తం రూ. 500 కోట్లు
- వైఎస్సార్ జగనన్న చేదోడు రూ. 300 కోట్లు
- వైఎస్సార్ వాహన మిత్ర రూ. 260 కోట్లు
- వైఎస్సార్ నేతన్న నేస్తం రూ. 199 కోట్లు
- వైఎస్సార్ మత్స్యకార భరోసా రూ. 120.49 కోట్లు
- మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ రూ. 50 కోట్లు
- రైతుల ఎక్స్‌గ్రేషియా రూ. 20కోట్లు
- లా నేస్తం రూ. 15 కోట్లు
- జగనన్న తోడు రూ. 25 కోట్లు
- ఈబీసీ నేస్తం రూ. 590 కోట్లు
- వైఎస్సార్ ఆసరా రూ. 6, 400 కోట్లు
- వైఎస్సార్ చేయూత రూ. 4, 235 కోట్లు
- అమ్మ ఒడి రూ. 6, 500 కోట్లు
Published date : 11 Mar 2022 11:42AM