Kalyanalakshmi: కల్యాణలక్ష్మికి రూ.2 వేల కోట్లు
Sakshi Education
కల్యాణలక్ష్మి పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది.
కొంతకాలంగా ఈ పథకానికి నిధుల విడుదలలో జాప్యం వల్ల చెల్లింపులు సకాలంలో జరగడం లేదు. ఈ క్రమంలో లబ్ధిదారులందరికీ ఒకేసారి నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఒకే దఫా రూ.2 వేల కోట్ల విడుదలకు అనుమతిచ్చింది. ఈమేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఏప్రిల్ 19న ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా విడుదల చేసిన నిధులతో ఇప్పటివరకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం బకాయిలన్నీ చెల్లించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
Ambedkar Statue: దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం.. 125 అడుగుల విగ్రహ రూపకర్త, విగ్రహ ప్రత్యేకతలివే..
Published date : 20 Apr 2023 05:21PM