Skip to main content

YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల..

ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(ఏపీ పీసీసీ) అధ్యక్షురాలిగా షర్మిల నియమితులయ్యారు.
Sharmila, President of Andhra Pradesh Congress Committee    YS Sharmila Appointed As Andhra Pradesh Congress Chief   AICC Official Statement

ఈ మేరకు ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ(ఏఐసీసీ) జ‌న‌వ‌రి 16వ తేదీ (మంగ‌ళ‌వారం) అధికారిక ప్రకటన వెలువరించింది. తాజాగా ఏపీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏఐసీసీ నియమించింది.  

First Woman DG CISF: సీఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్

షర్మిల వైఎస్సార్‌టీపీని 2021 జులై 8వ తేదీన ప్రారంభించారు. 2021 అక్టోబర్‌లో చేవెళ్ల నుంచి పాదయాత్ర చేశారు షర్మిల. తన పార్టీ YSRTPని జనవరి 4, 2024న కాంగ్రెస్‌లో విలీనం చేశారు షర్మిల. ఆ తర్వాత పరిణామాలు చకచకా మారిపోయాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా APCC చీఫ్‌గా ఉన్న గిడుగు రుద్రరాజు సోమవారం ఆ పదవికి రాజీనామా చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే షర్మిలను కాంగ్రెస్‌ పెద్దలు ఏపీసీసీ చీఫ్‌గా నియమించారు. 

 

 

Published date : 17 Jan 2024 10:33AM

Photo Stories