Eastern Naval Command: తూర్పు నౌకాదళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్?
తూర్పు నౌకాదళానికి 29వ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు తూర్పు నౌకాదళాధిపతిగా ఉన్న వైస్ అడ్మిరల్ అజేంద్ర బహద్దూర్‌సింగ్ పశ్చిమ నౌకాదళాధిపతిగా బదిలీ కావడంతో ఆయన స్థానంలో బిస్వజిత్ నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన బిస్వజిత్‌కు ఈస్ట్రన్ నేవల్ కమాండ్.. సెరమోనియల్ పరేడ్‌తో ఘన స్వాగతం పలికింది. బిశ్వజిత్ దాస్‌గుప్తా నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. 1985లో భారత నౌకాదళంలోకి ప్రవేశించిన ఆయన.. నావిగేషన్ డైరెక్షన్‌లో నిపుణుడు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో ఉంది.
చదవండి: హోండూరస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : తూర్పు నౌకాదళానికి 29వ చీఫ్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఇప్పటివరకు తూర్పు నౌకాదళాధిపతిగా ఉన్న వైస్ అడ్మిరల్ అజేంద్ర బహద్దూర్‌సింగ్ పశ్చిమ నౌకాదళాధిపతిగా బదిలీ కావడంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్