First Female President: హోండూరస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళ?
సెంట్రల్ అమెరికా దేశమైన హోండూరస్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార నేషనల్ పార్టీ ఓటమిని అంగీకరించింది. ప్రతిపక్ష లిబర్టీ అండ్ రీఫౌండేషన్ పార్టీని విజయం వరించింది. నూతన అధ్యక్షురాలిగా ప్రతిపక్ష అభ్యర్థి 62 ఏళ్ళ షియోమరా క్యాస్ట్రో ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. దీంతో హోండూరస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె రికార్డు నెలకొల్పనున్నారు.
హోండూరస్ అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 28న జరిగాయి. నవంబర్ 30 వరకూ 52 శాతం ఓట్లే లెక్కించారు. ఇందులో షియోమరా 53 శాతం ఓట్లు సాధించగా, అధికార పార్టీ అభ్యర్థి నాజ్రీ అస్ఫురాకు 34 శాతం ఓట్లే వచ్చాయి. అధికార పార్టీ తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేసింది.
హోండూరస్..
రాజధాని: తెగూసిగల్పా; కరెన్సీ: లెంపిరా(హెచ్‌ఎన్‌ఎల్);
చదవండి: ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : హోండూరస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళ?
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : షియోమరా క్యాస్ట్రో
ఎందుకు : ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లిబర్టీ అండ్ రీఫౌండేషన్ పార్టీ విజయం సాధించడంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్