Ajay Kumar Bhalla : అజయ్‌కుమార్ భల్లా పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగింపు.. వరసగా మూడోసారి..
Sakshi Education
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆగస్టు 19వ తేదీన (శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేసింది.
ఆయన 2023 ఆగస్టు 22 వరకూ ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. భల్లా పదవీ కాలాన్ని పొడిగించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 1984 బ్యాచ్ అస్సాం–మేఘాలయా క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన భల్లా తొలుత 2019 ఆగస్టులో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2020 నవంబర్‌లో రిటైర్ అయ్యారు. దీంతో పదవీ కాలాన్ని రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మూడోసారి సైతం పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Published date : 20 Aug 2022 05:01PM