Skip to main content

Mount Everest: ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి

Telugu Current Affairs - Persons: తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామానికి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డి మే 16న ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు.
mountaineer Anvitha Reddy

స్థానికంగా ఉన్న రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తున్న 25 ఏళ్ల పడమటి అన్వితారెడ్డి నేపాల్‌లోని లుక్లా నుంచి మే 9న ఎవరెస్ట్‌ అధిరోహణ మొదలు పెట్టారు. మే 12న బేస్‌ క్యాంప్‌ నుంచి యాత్ర ప్రారంభించి, మే 16న ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు.

Telangana: రాష్ట్ర హైకోర్టు నూతన సీజేగా ఎవరు నియమితులు కానున్నారు?

GK Persons Quiz: కర్ణాటక బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్‌కు అంబాసిడర్‌గా నియమితులైన భారతీయ క్రికెటర్‌?

యూరప్‌లోని ఎత్తయిన శిఖరం ఏది?
అన్వితారెడ్డి ఇప్పటికే ఫిబ్రవరి 2021లో ఖాడే పర్వతాన్ని (భారతీయ హిమాలయాలు–సో–మోరిరి, లదాఖ్‌), జనవరి 2021లో ఆఫ్రికా ఖండంలో ఎత్తయిన శిఖరం కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. డిసెంబర్‌ 2021లో యూరప్‌లోని ఎత్తయిన శిఖరం ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని ఎక్కి.. రికార్డు సృష్టించారు. అన్వితారెడ్డి తండ్రి మధుసూదన్‌రెడ్డి రైతు కాగా, తల్లి చంద్రకళ భువనగిరిలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు.​​​​​​​

Prime Minister of France: ఫ్రాన్స్‌ ప్రధాని పగ్గాలు చేపట్టిన రెండో మహిళ ఎవరు?

GK Awards Quiz: 2022 మాల్కం ఆదిశేషయ్య అవార్డు ఎవరికి లభించింది?Chief of Army Staff of India: మనోజ్‌ పాండేకు పరమ విశిష్ట సేవా పురస్కారం​​​​​​​

Sainthood: ఇటీవల సెయింట్‌హుడ్‌ పొందిన భారత పౌరుడు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 21 May 2022 06:21PM

Photo Stories