Prime Minister of France: ఫ్రాన్స్ ప్రధాని పగ్గాలు చేపట్టిన రెండో మహిళ ఎవరు?
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎలిజబెత్ బోర్న్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న జీన్ కాస్టెక్స్ నుంచి మే 16న ఆమె బాధ్యతలు స్వీకరించారు. దీంతో దేశ ప్రధాని పగ్గాలు చేపట్టిన రెండో మహిళగా నిలిచారు. 1991–92లో ఎడిత్ క్రేసన్ ఫ్రాన్స్ తొలి మహిళా ప్రధానిగా పని చేశారు. బోర్న్ గత ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేశారు. త్వరలో అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో కలిసి బోర్న్ నూతన మంత్రివర్గాన్ని నియమిస్తారు.
GK Important Dates Quiz: ప్రపంచ కిడ్నీ దినోత్సవం 2022 ఏ రోజున జరుపుకుంటారు?
ఆర్‌ఏటీపీ కంపెనీకి సీఈఓగా..
రాజకీయాల్లోకి రాకముందు ఎలిజబెత్ బోర్న్ ప్రభుత్వానికి చెందిన ఆర్‌ఏటీపీ కంపెనీకి సీఈఓగా పనిచేశారు. 2017లో మాక్రాన్‌కు చెందిన సెంట్రిస్ట్ పార్టీలో చేరారు. ఫ్రాన్స్‌లో అధ్యక్షుడి పదవీ కాలం పూర్తయ్యేలోపు ప్రధానులు మారుతూనే ఉంటారు. కార్మిక మంత్రిగా ఆమె తెచ్చిన సంస్కరణలకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలు బోర్న్ సత్తాకు పరీక్షగా నిలవనున్నాయి.Sainthood: ఇటీవల సెయింట్‌హుడ్ పొందిన భారత పౌరుడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫ్రాన్స్ ప్రధాని పగ్గాలు చేపట్టిన రెండో మహిళ ఎవరు?
ఎప్పుడు : మే 16
ఎవరు : ఎలిజబెత్ బోర్న్
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్