Andhra Pradesh: రాష్ట్ర ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన అధికారి?
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్‌గా పి.సీతారామాంజనేయులు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. రవాణా శాఖ కమిషనర్, ఏపీపీఎస్‌సీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీటన్నింటి నుంచి ఆయన్ను రిలీవ్ చేసి ఇంటెలిజెన్స్ డీజీగా కీలక బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ఫిబ్రవరి 22న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా ఉన్న కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీగా నియమితులైన విషయం తెలిసిందే.
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా బాగ్చి..
ఇప్పటివరకు సీతారామాంజనేయులు నిర్వహిస్తున్న రవాణా కమిషనర్ బాధ్యతలను ఎం.టి.కృష్ణబాబుకి, ఏపీపీఎస్‌సీ కార్యదర్శి బాధ్యతల్ని ఎ.బాబుకి ప్రభుత్వం అప్పగించింది. ఏసీబీ డీజీ బాధ్యతల్ని డీజీపీకి అదనంగా అప్పగించారు. ఏపీఎస్‌పీ బెటాలియన్స్ అదనపు డీజీగా ఉన్న శంఖబ్రత బాగ్చిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు.
ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉన్నారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె.ఎస్.జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. టీటీడీ ఈవో అదనపు బాధ్యతలను ఆయనకే కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో ఎనిమిదిమంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఫిబ్రవరి 22న
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీచేశారు.
చదవండి: డొనాల్డ్ ట్రంప్‌కి చెందిన సోషల్ మీడియా యాప్ పేరు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన అధికారి?
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : పి.సీతారామాంజనేయులు
ఎందుకు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్