Former American President: డొనాల్డ్ ట్రంప్‌కి చెందిన సోషల్ మీడియా యాప్ పేరు?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సామాజిక మాధ్యమ వేదిక(సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్) ‘ట్రూత్ సోషల్’ ఫిబ్రవరి 21న ప్రారంభమైంది. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ఆధ్వర్యంలో ‘ట్రూత్ సోషల్’ యాప్‌ను ప్రారంభించారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నేతగా డొనాల్డ్ ట్రంప్ కొనసాగారు. 2021, జనవరి 6న అమెరికాలోని కేపిటల్ భవనంపై జరిగిన దాడిలో ప్రమేయం ఉందంటూ ట్రంప్‌ను ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థలు ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లు బహిష్కిరించాయి. ట్రంప్ విద్వేష పోస్టులు చేస్తున్నారంటూ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తన మద్దతుదారులకు సొంత సోషల్ మీడియా యాప్ ద్వారా చేరువవుతానని ట్రంప్ గతంలో ప్రకటించాడు. ఈ మేరకు యాపిల్ యాప్ స్టోర్‌లో ట్రూత్ సోషల్ అందుబాటులోకి వచ్చింది.
చదవండి: రాష్ట్ర డీజీపీగా అత్యధిక కాలం పని చేసిన అధికారి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సామాజిక మాధ్యమ వేదిక ‘ట్రూత్ సోషల్’ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్
ఎందుకు : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన మద్దతుదారులకు సొంత సోషల్ మీడియా యాప్ ద్వారా చేరువయ్యేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్