Maryam Nawaz: పాకిస్థాన్‌లో తొలి మహిళా ముఖ్యమంత్రిగా మరియం నవాజ్
Sakshi Education
పాకిస్తాన్‌కు మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు, పీఎంఎల్–ఎన్ ఉపాధ్యక్షురాలు అయిన మరియం నవాజ్(50) చరిత్ర సృష్టించారు.
రాజకీయంగా ఎంతో కీలకమైన పంజాబ్ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఆమె ఎన్నికయ్యారు. పాకిస్తాన్ చరిత్రలో ఒక ప్రావిన్స్‌కు సీఎంగా మహిళ పగ్గాలు చేపట్టడం ఇదే మొట్టమొదటిసారి. ఆమె దేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా వ్యవహరించిన నవాజ్ షరీఫ్ కుమార్తె.
పంజాబ్ అసెంబ్లీలో ప్రస్తుతం 327 సీట్లుండగా ముఖ్యమంత్రి అభ్యర్థికి 187 మంది సభ్యుల అవసరం ఉంటుంది. ఇటీవలి ఎన్నికల్లో పీఎంఎల్–ఎన్ 137 సీట్లు గెలుచుకోగా, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పీటీఐకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు 113 సీట్లు, ఇతర స్వతంత్రులు 20 సీట్లు సాధించారు. వీరిలో స్వతంత్రులు పీఎంఎల్–ఎన్‌కు మద్దతు పలికారు.
Shehbaz Sharif: పాకిస్తాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్!
Published date : 27 Feb 2024 11:59AM