Skip to main content

Shehbaz Sharif: పాకిస్తాన్ ప్ర‌ధానిగా షెహబాజ్ షరీఫ్!

పాకిస్తాన్ నూత‌న ప్ర‌ధానమంత్రిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్ ఎన్) పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు షెహబాజ్ షరీఫ్(72) భాద్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.
Pakistan Prime Minister Shehbaz Sharif

పీఎంఎల్‌‌-ఎన్‌‌ పార్టీ మాజీ ప్రధాని షెహబాజ్ ​షరీఫ్​ను ఫిబ్ర‌వ‌రి 13వ తేదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించింది. ఇటీవల జరిగిన పాక్ పార్లమెంటరీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో 264 పార్లమెంటు స్థానాలకు గాను పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతిచ్చిన 101 మంది ఇండిపెండెట్లు గెలుపొందారు. నవాజ్ షరీఫ్ పీఎంఎల్-ఎన్ 80 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) రెండో స్థానం దక్కించుకుంది.  

133 స్థానాలకు.. 152 సీట్ల బలం
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన ఆసిఫ్ అలీ జర్దారీ, ముత్తాహిదా క్వామీ మూవ్‌‌మెంట్ పాకిస్తాన్(ఎంక్యూఎంపీ)కి చెందిన ఖలీద్ మక్బూల్ సిద్ధిఖీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ -క్వైద్(పీఎంఎల్​క్యూ)కు చెందిన షుజాత్ హుస్సేన్ నివాసంలో హెహబాజ్ ​సమావేశమై సంప్రదించారు. ఆరు పార్టీలు మద్దతు తెలుపడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం స్ప‌ష్ట‌మ‌య్యింది. పీఎంఎల్ఎన్ ​పార్టీ 75 సీట్లు గెల్చుకోగా పీపీపీ(54), ఎంక్యూఎంపీ(17), పీఎంఎల్​క్యూ(3), ఐపీపీ(2), బీఏపీ(1) పార్టీలతో కలిసి సంకీర్ణ కూటమి బలం 152 సీట్లుగా ఉంది.

Elon Musk: వామ్మో.. నిమిషానికి రూ.5.71 ల‌క్ష‌ల సంపాద‌న‌!!

Published date : 16 Feb 2024 06:09PM

Photo Stories