Heavy Rains: భారీ వర్షాలు.. 87 మంది మృతి..!
Sakshi Education
గత వారం రోజులుగా పాకిస్తాన్‌లో కురుస్తున్న భారీ వర్షాలు భయంకరమైన విధ్వంసాన్ని చూపించాయి.
ఈ ఘటనల్లో ఇప్పటివరకు 87 మంది మృతి చెందగా, 82 మంది గాయపడ్డారని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎంఎ) తెలిపింది. దేశవ్యాప్తంగా 2,715 ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయి.
ప్రాంతాల వారీగా మరణాల సంఖ్య..
ఖైబర్ పఖ్తున్‌ఖ్వా: 36 మరణాలు, 53 గాయాలు
పంజాబ్: 25 మరణాలు, 8 గాయాలు
బలూచిస్తాన్: 15 మరణాలు, 10 గాయాలు
పాక్ ఆక్రమిత కాశ్మీర్: 11 మరణాలు, 11 గాయాలు
ప్రధాన మంత్రి స్పందన..
పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు సహాయం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
వాతావరణ అంచనా..
వాతావరణ శాఖ తన అంచనా నివేదికలో ఏప్రిల్ 22వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
Published date : 20 Apr 2024 11:35AM