Maldives New President: మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా మొహ్మద్ మయిజ్జు
Sakshi Education
మాల్దీవుల్లో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.
Maldives new president Mohamed Muizzu
ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ నేత, పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి మొహ్మద్ మయిజ్జు దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పోలింగ్‌లో ఆయనకు 54.06 శాతం ఓట్లు దక్కాయి. దేశాధ్యక్షుడిగా మయిజ్జు నవంబర్ 17న బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత దేశాధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా కొనసాగుతారు.