Niraj Bishnoi: బుల్లి బాయ్ యాప్ సృష్టికర్త ఎవరు?
ముస్లిం మహిళల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి వేలానికి పెట్టిన ‘బుల్లి బాయ్’ యాప్ సృష్టికర్తని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంకు చెందిన నీరజ్ బిష్ణోయ్ (21) ఈ యాప్‌ను తయారు చేశాడని, అతనే ఈ కేసుకి ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు. జనవరి 6న అస్సాంలోని నీరజ్ సొంతూరు జోర్హత్‌లో ఢిల్లీ పోలీసు యంత్రాంగానికి చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్‌ఎస్‌ఒ) బలగాలు అతనిని అదుపులోనికి తీసుకొని ఢిల్లీకి తీసుకువచ్చాయి.
ఈ కేసులో ఇప్పటికే ముంబై పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన వారిలో ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి శ్వేతా సింగ్ ప్రధాన నిందితురాలిగా ఇప్పటివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నీరజ్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోబీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
చదవండి: దేశంలోనే అత్యుత్తమ డీజీపీగా నిలిచిన అధికారి?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్