The Better India: దేశంలోనే అత్యుత్తమ డీజీపీగా నిలిచిన అధికారి
ప్రజలకు సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ దేశంలోనే అత్యుత్తమ డీజీపీగా నిలిచారని ది బెటర్ ఇండియా సంస్థ ప్రకటించింది. 2021లో ఉత్తమ సేవలు అందించిన 12 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల జాబితాను ఆ సంస్థ జనవరి 1న విడుదల చేసింది. గడిచిన రెండేళ్లలో కోవిడ్ వల్ల అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చిందని, అటువంటి క్లిష్ట సమయంలోనూ డీజీపీ సవాంగ్ ప్రజలకు విశేష సేవలు అందించారని కితాబిచ్చింది.
2022 ఏడాది యూనికార్న్ హోదా దక్కించుకున్న తొలి సంస్థ?
మామాఎర్త్ తదితర బ్రాండ్స్ పేరిట వ్యక్తిగత సౌందర్య సంరక్షణ సాధనాలు విక్రయించే ఈ–కామర్స్ సంస్థ హోనాసా కన్జూమర్ తాజాగా 1.2 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో 52 మిలియన్ డాలర్లు సమీకరించింది. తద్వారా 2022 ఏడాది యూనికార్న్ హోదా దక్కించుకున్న తొలి సంస్థగా నిలిచింది.
చదవండి: ఓఎన్‌జీసీ సీఎండీగా నియమితుతలైన తొలి మహిళ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021 ఏడాదిలో అత్యుత్తమ డీజీపీగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ నిలిచారు
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : ది బెటర్ ఇండియా సంస్థ
ఎక్కడ : దేశంలో..
ఎందుకు : కోవిడ్ క్లిష్ట సమయంలోనూ పజలకు విశేష సేవలు అందించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్