Oil and Natural Gas Corporation: ఓఎన్‌జీసీ సీఎండీగా నియమితుతలైన తొలి మహిళ?
ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ)కి తొలి మహిళా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా (తాత్కాలిక ప్రాతిపదికన) అల్కా మిట్టల్ నియమితులయ్యారు. డిసెంబర్ 31తో పదవీ విరమణ చేసిన తాత్కాలిక హెడ్ సుభాష్ కుమార్ స్థానంలో ఆమె నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి 1 నుంచి ఆరు నెలల పాటు అల్కా మిట్టల్ (59)కు ఓఎన్‌జీసీ సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించాలన్న కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ ప్రతిపాదనకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఆగస్టు ఆఖరుతో మిట్టల్ పదవీకాలం పూర్తవుతుంది. ఈ విషయాలను జనవరి 4న సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) వెల్లడించింది.
ఇదే తొలిసారి..
ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, కామర్స్‌లో డాక్టరేట్ చేసిన అల్కా మిట్టల్.. 2018 నవంబర్ 27న ఓఎన్‌జీసీ బోర్డులో తొలి మహిళా మెంబర్‌గా నియమితులయ్యారు. తాజాగా కంపెనీ సీఎండీగా నియమితులయ్యారు. ఒక చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి కంపెనీకి .. మహిళ సారథ్యం వహించడం ఇదే తొలిసారి. అప్పట్లో (2014లో) ప్రభుత్వ రంగ రిఫైనర్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)కు తొలి మహిళా హెడ్‌గా నిశి వాసుదేవ సేవలు అందించారు.
చదవండి: సుప్రీంకోర్టులో తొలి తెలంగాణ న్యాయమూర్తి పదవీ విరమణ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ)కి తొలి మహిళా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా (తాత్కాలిక ప్రాతిపదికన) నియామకం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : అల్కా మిట్టల్
ఎందుకు : ఓఎన్‌జీసీ తాత్కాలిక హెడ్ సుభాష్ కుమార్ 2021, డిసెంబర్ 31న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్