Retirement: సుప్రీంకోర్టులో తొలి తెలంగాణ న్యాయమూర్తి పదవీ విరమణ
2018, నవంబర్ 2న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సుభాష్ రెడ్డి 2022, జనవరి 4న పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతం నుంచి సుప్రీంకోర్టుకు నియమితులైన తొలి న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి అని తెలిపారు. సుప్రీంకోర్టు సహా వివిధ కోర్టుల్లో సుదీర్ఘంగా 20 ఏళ్లపాటు న్యాయమూర్తిగా ఉన్న ఆయన ప్రజల స్వేచ్ఛను పరిరక్షించడం, సమర్థించడం చేశారన్నారు. సుప్రీంకోర్టు జడ్జీగా 100కు పైగా తీర్పులు ఇచ్చారని పేర్కొన్నారు. సుభాష్ రెడ్డి పదవీ విరమణతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరింది. మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34(33+1).
మెదక్ జిల్లా..
తెలంగాణలోని మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలం కామారం గ్రామంలో జగన్నా«థ్ రెడ్డి, విశాలదేవి దంపతులకు జనవరి 5, 1957లో సుభాష్ రెడ్డి జన్మించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టులో 1980, అక్టోబర్ 30న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2002, డిసెంబరు 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా చేరి, 2004లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఇక్కడ నుంచి 2016, ఫిబ్రవరి 13న గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు. అనంతర కాలంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
చదవండి: రైల్వే బోర్డు చైర్మన్‌గా నియమితులైన అధికారి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సుప్రీంకోర్టులో తొలి తెలంగాణ న్యాయమూర్తి పదవీ విరమణ
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : జస్టిస్ సుభాష్ రెడ్డి
ఎక్కడ : న్యూఢిల్లీ
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్