Chairman and CEO: రైల్వే బోర్డు చైర్మన్‌గా నియమితులైన అధికారి?
రైల్వే బోర్డు చైర్మన్, ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో)గా ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్ వినయ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. 1998 బ్యాచ్ ఐఆర్ఎస్ఈఈ అధికారి అయిన వినయ్ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదముద్ర వేసింది. 2022, జనవరి, 1 నుంచి జూన్, 31 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన జులై 1న పునఃనియమితులై డిసెంబరు, 31 వరకు కొనసాగుతారు.
అంతర్జాతీయ జ్యులరీ ప్రదర్శన వాయిదా
‘ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెల్లరి షో సిగ్నేచర్’ (ఐఐజేఎస్)ను వాయిదా వేస్తున్నట్టు జెమ్ అండ్ జ్యులయరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రకటించింది. 2022, జవనరి 6 నుంచి 9 వరకు ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించాలని గతంలో జీజేఈపీసీ నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా పరిస్థితులను దృష్టిలో పెంచుకుని ఐఐజేఎస్ వాయిదా వేసినట్టు డిసెంబర్ 31న జీజేఈపీసీ చైర్మన్ కొలిన్‌షా తెలిపారు.
చదవండి: డిప్యూటీ భద్రతా సలహాదారుగా నియమితులైన అధికారి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : రైల్వే బోర్డు చైర్మన్, ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో)గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్ వినయ్ కుమార్ త్రిపాఠి
ఎందుకు : కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం మేరకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్