National Security Council: డిప్యూటీ భద్రతా సలహాదారుగా నియమితులైన అధికారి?
విదేశీ వ్యవహారాల అధికారి విక్రమ్ మిశ్రి.. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్లో డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం డిసెంబర్ 27న ప్రకటించింది. 1989 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన మిశ్రి 2019 నుంచి ఇప్పటి వరకు చైనాలో భారత రాయబారిగా విధులు నిర్వహించారు. భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో రాయబారిగా కీలక సేవలు అందించారు. 2014 మే-జులైలో ప్రధాని మోదీకి, అంతకు ముందు 2012 అక్టోబరు నుంచి 2014 మే వరకు నాటి ప్రధాని మన్మోహన్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు. ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాలో భారత్ మిషన్లకు ప్రాతినిధ్యం వహించారు. మయన్మార్, స్పెయిన్లకు భారత రాయబారిగా కూడా పనిచేశారు. విక్రమ్ మిశ్రి స్థానంలో ప్రదీప్ కుమార్ రావత్ చైనాలో రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు.
చదవండి: సంయుక్త సంఘర్షణ మోర్చా పార్టీని ఏర్పాటు చేసిన వ్యక్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైన అధికారి?
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ఐఎఫ్‌ఎస్ అధికారి విక్రమ్ మిశ్రి
ఎందుకు : ప్రభుత్వ నిర్ణయం మేరకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్