New Political Party: సంయుక్త సంఘర్షణ మోర్చా పార్టీని ఏర్పాటు చేసిన వ్యక్తి?
రైతు ఉద్యమ ముఖ్య నేతల్లో ఒకరైన గుర్నామ్ సింగ్ చదుని సొంతంగా ‘సంయుక్త సంఘర్షణ మోర్చా’ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. త్వరలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పాల్గొంటుందని డిసెంబర్ 18న గుర్నామ్ సింగ్ తెలిపారు. స్వచ్ఛ రాజకీయాలు, మంచినేతలను ప్రోత్సహించడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా ఆందోళనలు కొనసాగించిన 40 రైతు సంఘాల సమాఖ్య సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) సభ్యుల్లో గుర్నామ్ సింగ్ చదుని కూడా ఒకరు. ఈయన హరియాణా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడిగా ఉన్నారు.
135 ఏళ్ల చైనా వృద్ధురాలు కన్నుమూత
చైనాలోనే అత్యంత వృద్ధురాలైన అలిమిహాన్ సెయిటి(135) కన్నుమూశారని జిన్‌జియాంగ్ ఉయ్‌గుర్ అటానమస్ ప్రాంత అధికారులు డిసెంబర్ 18న వెల్లడించారు. షులే కౌంటీలోని కొముక్జెరిక్ టౌన్‌షిప్‌నకు చెందిన అలిమిహాన్ 1886 జూన్ 25వ తేదీన జన్మించారు.
చదవండి: బ్లడ్ శాండర్స్: ద గ్రేట్ ఫారెస్ట్ హీస్ట్ పుస్తక రచయిత ఎవరు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సంయుక్త సంఘర్షణ మోర్చా పేరుతో రాజకీయ పార్టీ స్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : రైతు ఉద్యమ నేత గుర్నామ్ సింగ్ చదుని
ఎక్కడ : పంజాబ్
ఎందుకు : స్వచ్ఛ రాజకీయాలు, మంచినేతలను ప్రోత్సహించడమే లక్ష్యంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్