CJI Justice NV Ramana: బ్లడ్ శాండర్స్: ద గ్రేట్ ఫారెస్ట్ హీస్ట్ పుస్తక రచయిత ఎవరు?
ప్రముఖ పాత్రికేయుడు ఉడుముల సుధాకర్‌రెడ్డి రచించిన ‘బ్లడ్ శాండర్స్: ద గ్రేట్ ఫారెస్ట్ హీస్ట్’ పుస్తకాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ఆవిష్కరించారు. డిసెంబర్ 15న వర్చువల్ విధానం ద్వారా జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ... రచయిత, టైమ్స్ ఆఫ్ ఇండియా పరిశోధన విభాగం సంపాదకుడు సుధాకర్‌రెడ్డి రచయిత, టైమ్స్ ఆఫ్ ఇండియా పరిశోధన విభాగం సంపాదకుడు సుధాకర్‌రెడ్డి రెండు దశాబ్దాల సుదీర్ఘ పరిశోధన అనంతరం ఈ పుస్తకం తీసుకొచ్చారన్నారు. ఎర్రచందనం, శేషాచల అటవీ పర్యావరణ వ్యవస్థ రక్షణ, పరిరక్షణ నిమిత్తం రచయిత పుస్తకంలో మంచి సూచనలు చేశారని అభినందించారు. అత్యంత విలువైన కలప అయిన ఎర్ర చందనాన్ని ఎర్ర బంగారం అని కూడా అంటారు. ఎర్ర చందనం వృక్ష శాస్త్రీయ నామం టెరోకార్పస్ సంటాలినస్(Pterocarpus santalinus). ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మరెక్కడా పెరగదు.
చదవండి: ఏ ఏడాది ఎస్‌ఈసీసీ డేటాలో లోపాలున్నాయని కేంద్రం తెలిపింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్లడ్ శాండర్స్: ద గ్రేట్ ఫారెస్ట్ హీస్ట్ పుస్తక రచయిత ఎవరు?
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : ప్రముఖ పాత్రికేయుడు ఉడుముల సుధాకర్‌రెడ్డి
ఎందుకు : ఎర్రచందనం, శేషాచల అటవీ పర్యావరణ వ్యవస్థ రక్షణ, పరిరక్షణ నిమిత్తం సూచనలు చేసేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్