Supreme Court: ఏ ఏడాది ఎస్‌ఈసీసీ డేటాలో లోపాలున్నాయని కేంద్రం తెలిపింది?
2011 ఏడాదిలో చేపట్టిన సామాజికార్థిక కులగణన(ఎస్‌ఈసీసీ–2011) గణాంకాల్లో లోపాలున్నాయని, ఓబీసీల డేటాకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 14న సుప్రీంకోర్టుకు వెల్లడించింది. లోపభూయిష్ట సమాచారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందనే ఈ నివేదికను బహిర్గతం చేయలేదని తెలిపింది. ఓబీసీలకు రిజర్వేషన్లను తాము సమర్థిస్తామని పేర్కొంది. ఎస్‌ఈసీసీ 2011 వివరాలను తమకందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. తాము ఎన్నిమార్లడిగినా కేంద్రం ఈ గణాంకాలు అందించడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానమిచ్చారు.
ముందస్తు ‘కుట్ర’తోనే రైతులను తొక్కించారు: సిట్
లఖింపూర్ ఖేరి హింసాకాండలో నిందితులు ముందస్తుగా రచించిన ప్రణాళిక, కుట్ర’తోనే నిరసన తెలుపుతున్న రైతుల పైకి వాహనాన్ని (స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్– ఎస్‌యూవీ) నడిపారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) స్పష్టం చేసింది. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిసెంబర్ 14న పేర్కొంది. సిట్ దర్యాప్తు పర్యవేక్షణకు పంజాబ్, హరియాణా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్‌ను నియమించిన విషయం తెలిసిందే.
చదవండి: లఖిమ్‌పూర్‌లో ఏం జరిగింది? ఏమిటీ కేసు? నిందితులు ఎవరు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్