Skip to main content

Expressways in India: నాలుగు రాష్ట్రాలను కలుపుతూ కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు

దేశంలోని నాలుగు రాష్ట్రాలను కలుపుతూ రాబోయే సంవత్సరంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌వే నిర్మితం కానుంది.
Varanasi Ranchi Kolkata Expressway  Expressway route linking four Indian states: Bihar, Uttar Pradesh, West Bengal, Jharkhand

ఇది బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలను అనుసంధానం చేయనుంది. ఈ రహదారి ఏర్పాటుతో బీహార్ ప్రజలకు అత్యధిక ప్రయోజనం చేకూరనుంది.

Ayushman Bharat: ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ కేంద్రాల పేరు మార్పు

ఈ ఎ‍క్స్‌ప్రెస్‌ వే ఏడు ప్యాకేజీలుగా  నిర్మాణం కానుంది. దీనిలోని ఐదు ప్యాకేజీలలో బీహార్‌లోని పలు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ  ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే అంచనా వ్యయం రూ.28,500 కోట్లు. ఇది 610 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే. ఇది నాలుగు రాష్ట్రాల మీదుగా వెళుతుంది. దీనిలో 159 కిలోమీటర్ల పొడవైన మార్గం బీహార్ మీదుగా వెళుతుంది. ఈ ప్రత్యేక గ్రీన్‌ఫీల్డ్ ఆరు లేన్‌ల ఎక్స్‌ప్రెస్‌వే కోసం బీహార్‌లో 136.7 కిలోమీటర్ల మేరకు అవసరమైన భూమిని గుర్తించారు. 

వారణాసి రింగ్ రోడ్‌లోని చందౌలీలో ఉన్న బర్హులి గ్రామం నుండి ఎక్స్‌ప్రెస్‌వే రహదారి నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ రహదారి బీహార్‌లోకి ప్రవేశించిన తర్వాత కైమూర్, రోహతాస్, ఔరంగాబాద్, గయ జిల్లాల మీదుగా వెళుతుంది. 
బీహార్‌లోని నాలుగు జిల్లాలను దాటి జార్ఖండ్‌కు చేరుకుంటుంది. ఇక్కడ ఐదు జిల్లాల గుండా వెళుతూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ నాలుగు జిల్లాల మీదుగా జాతీయ రహదారి- 19కి అనుసంధానమవుతుంది. జార్ఖండ్‌లో ఈ రహదారి పొడవు 187 కిలోమీటర్లు. పశ్చిమ బెంగాల్‌లో గరిష్టంగా 242 కిలోమీటర్లు. మొదటి ప్యాకేజీలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రారంభమై బీహార్‌లోని కొన్ని ప్రాంతాలతో అనుసంధానమవుతూ ముగుస్తుంది. 

రెండో ప్యాకేజీలో రహదారి నిర్మాణం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా నుండి ప్రారంభంకానుంది. ఇది ఇక్కడి చందౌలీలో ఉన్న బర్హులీ గ్రామం మీదుగా బీహార్‌లోకి ప్రవేశిస్తుంది. తరువాత  ఔరంగాబాద్, గయా జిల్లాల మీదుగా జార్ఖండ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఛత్రా, హజీరాబాగ్, రామ్‌ఘర్, పీటర్‌బార్, బొకారో మీదుగా ఈ ఎక్స్‌ప్రెస్‌వే పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ పురూలియా, బంకురా, ఆరంబాగ్ మీదుగా వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్ వే ఉలుబెరియా వద్ద జాతీయ రహదారి 19 వద్ద ముగుస్తుంది. 

Centre approves defence acquisition projects: రక్షణ కొనుగోలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్రం

Published date : 12 Dec 2023 03:01PM

Photo Stories