Mission Mausam: వాతావరణ సూచనలకు రూ.2 వేల కోట్లతో ‘మిషన్ మౌసమ్’!!
Sakshi Education
కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 11వ తేదీ వాతావరణ అంచనాల్లో కచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన 'మిషన్ మౌసమ్సకు ఆమోదం తెలిపింది.
ఈ మిషన్‌కు వచ్చే రెండేళ్లలో రూ.2,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. కచ్చితమైన వర్షపాతం, ఉష్ణోగ్రతల వివరాలు, రాడార్లు, ఉపగ్రహాలు, ఖచ్చితమైన అగ్రోమెట్ అంచనాలపై ఈ మిషన్ దృష్టి పెడుతోంది.
భారత వాతావరణ శాఖ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ సంయుక్తంగా ఈ మిషన్‌ను అమలు చేయనున్నాయి. కచ్చితత్వం, మోడలింగ్, రాడార్లు, ఉపగ్రహాలు, ఖచ్చితమైన అగ్రోమెట్ అంచనాలపై ఈ ‘మిషన్ మౌసమ్’ దృష్టి పెడుతుంది. వచ్చే 5-6 ఏళ్లలో కచ్చితమైన వాతావరణ సలహాలు, నౌకాస్ట్ సాంకేతిక పరిజ్ఞానం ఉండాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
Raising Crops: గణనీయంగా పెరిగిన పంటల సాగు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా..
Published date : 13 Sep 2024 08:32AM