Skip to main content

Gyanvapi Mosque: శివలింగానికి రక్షణ, నమాజుకు అనుమతి

Gyanvapi mosque

కాశీలోని జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వే సమయంలో కనుగొన్నట్లు చెబుతున్న శివలింగం ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను సుప్రీంకోర్టు మే 17న ఆదేశించింది. అందులో ముస్లింలు నమాజ్‌ కొనసాగించుకునేందుకు అనుమతినిచ్చింది. న్యాయ సమతుల్యతలో భాగంగా ఈ ఆదేశాలిస్తున్నామని జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ నరసింహతో కూడిన బెంచ్‌ తెలిపింది. 20 మందిని మాత్రమే నమాజుకు అనుమతించాలన్న కింద కోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చింది. మసీదు కమిటీ కోరినట్లు సర్వే తదితర ప్రక్రియలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

Indian Navy: సూరత్, ఉదయగిరి యుద్ధనౌకల జలప్రవేశం ఎక్కడ జరిగింది?

శివలింగం బయటపడిన ప్రాంతంలో ముస్లింలు వజు చేసుకుంటారని యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌(సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) తుషార్‌ మెహతా అన్నారు. అక్కడ ఎలాంటి విధ్వంసం జరిగినా శాంతిభద్రతల సమస్య వస్తుందని చెప్పారు.

GK Important Dates Quiz: అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం?

సర్వే కమిషనర్‌ అజయ్‌ మిశ్రా తొలగింపు..
జ్ఞానవాపి మసీదులో సర్వేకు నియమించిన కమిషన్‌ తమ పని ఇంకా పూర్తి కాలేదని పేర్కొంది. మరికొంత గడువు కావాలని అసిస్టెంట్‌ అడ్వకేట్‌ కమిషనర్‌ అజయ్‌ ప్రతాప్‌సింగ్‌ కోర్టును కోరారు. నివేదికలో 50 శాతం పూర్తయిందన్నారు. సర్వేలో భూగర్భ గదులను పరిశీలించామని చెప్పారు. సింగ్‌ అభ్యర్థన విన్న వారణాసి సివిల్‌ కోర్టు సర్వే పూర్తి చేయడానికి మరో రెండు రోజుల గడువిచ్చింది. సర్వే కమిషనర్‌ అజయ్‌ మిశ్రాను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. సర్వే సమయంలో మిశ్రా సొంతంగా ప్రైవేట్‌ ఫొటోగ్రాఫర్‌ను తెచ్చుకున్నారని మరో కమిషనర్‌ విశాల్‌ సింగ్‌ కోర్టుకు తెలిపారు.

Integrated Renewable Energy Project: ప్రపచంలో తొలి సోలార్, విండ్, హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు ఏది?

13th Century: కాకతీయుల కాలం నాటి శివాలయాన్ని ఎక్కడ గుర్తించారు?

మథుర మసీదులో నమాజ్‌ నిలిపివేతకు పిటిషన్‌..
ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని మథుర నగరంలోని షాహీ ఈద్గా మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించకుండా నిరోధించాలని కోరుతూ కొందరు న్యాయవాదులు, న్యాయవిద్యార్థులు స్థానిక కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ ప్రాంతం శ్రీకృష్ణ జన్మస్థలి అని అందువల్ల ఇక్కడ నమాజ్‌ను నిషేధించాలని వీరు కోరారు. ఇప్పటికే ఈ అంశంపై పది పిటీషన్లు మథుర కోర్టులో ఉన్నాయి. 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కత్రాకేశవ్‌ దేవ్‌ మందిరంలో ఈ మసీదు ఉంది.​​​​​​​

GK Important Dates Quiz: భారతదేశంలో జాతీయ టీకా దినోత్సవం 2022 ఎప్పుడు జరుపుకుంటారు?

​​​​​​​డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 18 May 2022 02:42PM

Photo Stories