Skip to main content

Google: గూగుల్‌కు షాక్‌... 2,200 కోట్లు కట్టితీరాల్సిందే... అడ్డదిడ్డమైన వాదనలు తెరపైకి తెచ్చిన గూగుల్‌..?

మనిషి దైనందిక జీవితంలో గూగుల్‌ కూడా ఒక భాగమైంది. ప్రస్తుత ప్రపంచంలో ‘‘గూగుల్‌ తల్లి’’ని వినియోగించని వారుండరు అంటే అతిశయోక్తి కాదు.
Shock to Google, 2,200 crores to be paid... Google brings to arguments?
Shock to Google, 2,200 crores to be paid... Google brings to arguments?

న్యూస్, మ్యాప్స్, యాప్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎంజాయ్‌మెంట్‌... ఇలా ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌ను ఆశ్రయించాల్సిందే. సర్చ్‌ ఇంజిన్‌లో గూగుల్‌ గుత్తాధిపత్యం సాధించడంపై కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్‌కు సీసీఐ షాక్‌ ఇచ్చింది. ఎందుకో చదవండి.

బతుకు దుర్భరం.... తన్నులాటలో ఒకరు మృతి... దివాళ దిశ‌గా అడుగులు
ప్లేస్టోర్‌ విషయంలో కాంపిటీషన్‌  కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఇచ్చిన ఉత్తర్వులపై మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) నిరాకరించింది. జరిమానా మొత్తం రూ.936.44 కోట్లలో 10 శాతం సొమ్మును నాలుగు వారాల్లో రిజిస్ట్రీ వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. 

పాఠాలు నేర్పిన యూ ట్యూబ్‌.... 60 లక్షలతో అదరగొట్టిన గుంటూరమ్మాయి
ప్లే స్టోర్‌ విధానాల్లో గుత్తాధిపత్యాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తుండటంతో సీసీఐ రూ.936.44 కోట్ల భారీ జరిమానా విధించింది. అనైతిక వ్యాపార కార్యకలాపాల నిరోధానికి చర్యలు చేపట్టాల్సిందిగా, నిర్దేశిత సమయంలోగా తన ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా సీసీఐ ఆదేశించింది. అలాగే థర్డ్‌పార్టీ బిల్లింగ్‌/యాప్‌ల కొనుగోలుకు సంబంధించి చెల్లింపు(పే మెంట్‌) సేవలను వినియోగించుకోకుండా యాప్‌ డెవలపర్లను అడ్డుకోవద్దని ఆదేశించింది. అంతకుముందు ఆండ్రాయిడ్‌ మొబైళ్ల విభాగంలో గూగుల్‌ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నందునందకు విధించిన రూ.1,337.76 కోట్ల జరిమానాకు ఇది అదనం. మొత్తంగా రూ.2200 కోట్ల జరిమానా పడింది.

ఒక్కసారి ఎంటర్‌ అయితే చాలు... ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఫ్రీ
సీసీఐ ఉత్తర్వులపై గూగుల్ ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించింది. ఆండ్రాయిడ్‌ విభాగానికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ట్రైబ్యునల్‌ సైతం నిరాకరించింది. జరిమానా మొత్తంలో 10 శాతం వెంటనే చెల్లించాలని ఆదేశించింది. తాజాగా ప్లేస్టోర్‌ విభాగానికి సంబంధించిన కేసును బుధవారం విచారించిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం.. స్టేకు నిరాకరించింది. సీసీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 17కు వాయిదా వేసింది. అయితే ఈ ఉదంతంపై గూగుల్‌ వితండవాదం చేస్తోంది. 

రెండు, మూడు రోజుల్లో గ్రూప్‌1 ప్రిలిమినరీ ఫలితాలు..?
సీసీఐ విధించిన రూ.1338 కోట్ల అపరాధ రుసుముపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ ఎన్‌సీఎల్‌ఏటీ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టులో గూగుల్‌ సవాలు చేసింది. గతంలో తమపై యూరోపియన్‌  యూనియన్‌  జారీ చేసిన ఆదేశాల నుంచి కొన్ని భాగాలను కాపీ కొట్టిందని సీసీఐపై గూగుల్‌ తన పిటిషన్‌ లో ఆరోపించింది. సీసీఐ ఆదేశాలు ‘అసాధారణమైనవని’, ‘తప్పుడు తడకలు’గా ఉన్నాయని గూగుల్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన పిటిషన్‌లో పేర్కొంది.

Published date : 11 Jan 2023 03:39PM

Photo Stories