Skip to main content

Indian Navy: వాగ్‌షీర్‌ జలాంతర్గామిని నిర్మించిన సంస్థ?

Wagsheer

ముంబై మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌(ఎండీఎల్‌) నిర్మించిన వాగ్‌షీర్‌ జలాంతర్గామి 2022, ఏప్రిల్‌ 20న ముంబై సముద్ర తీరంలో జలప్రవేశం చేయనుందని నేవీ అధికారులు ఏప్రిల్‌ 15న తెలిపారు. పీ75 స్కార్పిన్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ ఆరో సబ్‌మెరైన్‌ను నిర్మించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు రూ.46,000 కోట్ల విలువైన ఆర్డర్‌ దక్కిందని, ఇందులో 6 సబ్‌మెరైన్‌ ప్రాజెక్టులు, 15 బ్రేవో డిస్ట్రాయర్స్, 17 అల్ఫా స్టీల్త్‌ ఫ్రిగేట్స్‌ ఉన్నాయని ఎండీఎల్‌ చైర్మన్, ఎండీ నారాయణ్‌ ప్రసాద్‌ తెలిపారు. ఇప్పటికే 4 జలాంతర్గాములు, ఒక డిస్ట్రాయర్స్‌ సరఫరా చేశామని వివరించారు. పీ75 స్కార్పిన్‌ ప్రాజెక్టులో వాగ్‌షీర్‌ ఆఖరి జలాంతర్గామి. ఐదో జలాంతర్గామి అయిన ‘వగీర్‌’ సీ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐఎన్‌ఎస్‌ కల్వరీ, ఐఎన్‌ఎస్‌ ఖాందేరి, ఐఎన్‌ఎస్‌ కరాంజ్, ఐఎన్‌ఎస్‌ వేలా సబ్‌మెరైన్లు ఇప్పటికే విధుల్లో చేరాయి.

Pradhanmantri Sangrahalaya: ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ఎక్కడ ప్రారంభించారు?

India-Pakistan: అట్టారీ–వాఘా సరిహద్దును సందర్శించిన తొలి సీజేఐ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2022, ఏప్రిల్‌ 20న ‘వాగ్‌షీర్‌’ జలాంతర్గామి జలప్రవేశం
ఎప్పుడు : ఏప్రిల్‌ 15
ఎవరు    : నేవీ అధికారులు
ఎక్కడ    : అరేబియా సముద్రం, ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు..

Published date : 16 Apr 2022 01:46PM

Photo Stories