Pradhanmantri Sangrahalaya: ప్రధానమంత్రుల మ్యూజియాన్ని ఎక్కడ ప్రారంభించారు?
భారత మాజీ ప్రధానుల జీవిత/పరిపాలనా విశేషాలను భవిష్యత్తు తరాలు ఎల్లప్పుడూ స్మరించుకునేలా.. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లో ప్రధానమంత్రి సంగ్రహాలయ(ప్రధానమంత్రుల మ్యూజియం)ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చరిత్రను గుర్తుచేసే ఈ సంగ్రహాలయాన్ని ఏప్రిల్ 14న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మన దేశం నేటి ఉన్నత స్థితికి చేరడం వెనుక స్వాతంత్య్రానంతరం ఏర్పడిన అన్ని ప్రభుత్వాల కృషి ఉందని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ఈ మ్యూజియాన్ని ప్రారంభించడం ఎంతో సముచితమన్నారు.
Union Cabinet: రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ ప్రధాన ఉద్దేశం?
ప్రధానమంత్రి సంగ్రహాలయ – విశేషాలు
- నిర్మాణ ప్రదేశం: తీన్‌మూర్తి కాంప్లెక్స్, న్యూఢిల్లీ
- విస్తీర్ణం: 10,491 చదరపు మీటర్లు
- నిర్మాణ వ్యయం: రూ. 271 కోట్లు
- లోగో: ప్రజాస్వామ్యానికి చిహ్నమైన ధర్మచక్రాన్ని దేశ ప్రజలు ఎత్తి పట్టుకున్నట్లుగా ఉంటుంది.
- మ్యూజియంలో మొత్తం 43 గ్యాలరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు పనిచేసిన 14 మంది మాజీ ప్రధానుల అరుదైన చిత్రాలు, ప్రసంగాలు, వీడియో క్లిప్‌లు, ఇంటర్వ్యూలు, వారి చేతిరాతలను ఇందులో ప్రదర్శనకు ఉంచారు.
- స్వాతంత్య్ర సంగ్రామం, రాజ్యాంగ ముసాయిదా రచన వంటి అపురూప ఘట్టాలను గుర్తుచేసే చిత్రాలూ ఉన్నాయి.
- మాజీ ప్రధానులకు చెందిన కొన్ని వ్యక్తిగత వస్తువులు, వారికి వచ్చిన బహుమతులను కూడా పొందుపరిచారు.
New Covid Variant XE: దేశంలో తొలి ఎక్స్‌ఈ వేరియంట్ కేసు ఎక్కడ నమోదైంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధానమంత్రి సంగ్రహాలయ(ప్రధానమంత్రుల మ్యూజియం) ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : తీన్‌మూర్తి కాంప్లెక్స్, న్యూఢిల్లీ
ఎందుకు : భారత మాజీ ప్రధానుల జీవిత/పరిపాలనా విశేషాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్