New Covid Variant XE: దేశంలో తొలి ఎక్స్‌ఈ వేరియంట్ కేసు ఎక్కడ నమోదైంది?
వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉన్న వేరియంట్‌గా గుర్తింపు పొందిన ఎక్స్‌ఈ వేరియంట్ కరోనా వైరస్ భారత్‌లోకి చొరబడింది. ఈ వైరస్ తొలిసారిగా బ్రిటన్‌లో బయల్పడగా భారత్‌లో తొలిసారిగా ఏప్రిల్ 6న ముంబైలో కేసు నమోదైంది. కోవిడ్ రెండు డోస్‌లు తీసుకున్న 50 ఏళ్ల మహిళకు ఈ వేరియంట్ వైరస్ సోకింది. 2022, ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆమె ప్రస్తుతం కోలుకున్నారని బృహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.
Union Territory: చండీగఢ్‌ను తమకు బదలాయించాలని తీర్మానం చేసిన రాష్ట్రం?
తొలుత ఏ దేశంలో గుర్తించారు?
కోవిడ్ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. 2022, జనవరి 19న తొలుత యూకేలో గుర్తించిన ఈ కొత్త వేరియంట్‌కు ‘ఎక్స్‌ఈ రీకాంబినెంట్(బీఏ.1బీఏ.2)’ అని పేరుపెట్టారు. ఇప్పటిదాకా వచ్చిన వేరియంట్ల కంటే ఎక్స్‌ఈ రీకాంబినెంట్ వ్యాప్తి అధికంగా ఉందని ఏప్రిల్ 2న డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్‌లో సబ్ వేరియంట్ (బీఏ.2) కంటే 10 శాతం ఎక్కువగా వ్యాపిస్తోందని పేర్కొంది. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 నుంచి రూపాంతరం చెందినదే ఈ కొత్త వేరియంట్ ఎక్స్‌ఈ.
PM Narendra Modi: పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవిడ్ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ ‘‘ఎక్స్‌ఈ రీకాంబినెంట్’’ గుర్తింపు
ఎప్పుడు : ఏప్రిల్ 06
ఎవరు : బృహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు
ఎక్కడ : ముంబై
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్