PM Narendra Modi: పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు?
న్యూఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ఏప్రిల్ 1న కేంద్ర విద్యా శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ నిర్వహించిన ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పరీక్షలంటే భయం వద్దేవద్దని విద్యార్థులకు ఆయన ఉద్బోధించారు. పరీక్షలకు ఒక పండుగలా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తాము నెరవేర్చుకోలేని కలలు, ఆకాంక్షలను పిల్లలపై బలవంతంగా రుద్దవద్దని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ‘‘పీ3 (ప్రో ప్లానెట్ పీపుల్) ఉద్యమ’ అవసరం ఎంతైనా ఉంది. ‘యూజ్ అండ్ త్రో’ సంస్కృతిని వదిలించుకోవాలి.’’ అని ప్రధాని పేర్కొన్నారు. విద్యారులు పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ‘ఎగ్జామ్ వారియర్స్’ అనే పుస్తకాన్ని మోదీ రచించిన విషయం విదితమే.
AFSPA: సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం అమల్లోకి వచ్చిన తేదీ?
తుర్క్‌మెనిస్తాన్‌లో రాష్ట్రపతి పర్యటన
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు రోజుల పర్యటనకు గాను ఏప్రిల్ 1న తుర్క్‌మెనిస్తాన్ చేరుకున్నారు. రాజధాని అస్ఘాబట్ విమానాశ్రయంలో అధ్యక్షుడు సెర్దార్ బెర్దిముహమెదోవ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా అధ్యక్షుడు సెర్దార్‌తో కోవింద్ సమావేశమవుతారు. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై వారు చర్చలు జరుపుతారు.
Supreme Court: జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రారంభించిన ఫాస్టర్ సాఫ్ట్‌వేర్ ఉద్దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రసంగం
ఎప్పుడు : ఏప్రిల్ 01
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : తల్కటోరా స్టేడియం, న్యూఢిల్లీ
ఎందుకు : విద్యారులు పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా అవగాహన కల్పించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్