Supreme Court: జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రారంభించిన ఫాస్టర్ సాఫ్ట్‌వేర్ ఉద్దేశం?
న్యాయ ఆదేశాలు జాప్యం కాకుండా వేగంగా కక్షిదారులకు చేరడానికి రూపొందించిన ఫాస్ట్, సెక్యూర్డ్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్(ఫాస్టర్) సాఫ్ట్‌వేర్‌ను మార్చి 31న న్యూఢిల్లీలో సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రారంభించారు. అనతరం జస్టిస్ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ.. ఫాస్టర్ వ్యవస్థ నిమిత్తం దేశవ్యాప్తంగా 1887 ఈ–మెయిల్ ఐడీలు సృష్టించారని, సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో ఫాస్టర్ సెల్ ప్రారంభించారని తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా వేగంగా, సురక్షితంగా చేరేందుకు ఉపయోగపడే ఫాస్టర్ సాఫ్ట్‌వేర్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) రూపొందించింది.
PMGKAY: ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను ఎప్పటి వరకు పొడిగించారు?
2021, జూలై 16న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆగ్రా సెంట్రల్ జైలులో నిందితుల్ని మూడు రోజుల తర్వాత కూడా విడుదల చేయలేదంటూ పత్రికల్లో వచ్చిన కథనాన్ని సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. న్యాయ ఆదేశాలు త్వరగా చేరకపోవడం వల్ల దోషుల విడుదలలో జాప్యాన్ని గ్రహించిన సీజేఐ జస్టిస్ రమణ ఈ సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు సూచనలు చేశారు.
NITI Aayog: ఎగుమతుల సన్నద్ధత జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫాస్ట్, సెక్యూర్డ్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్(ఫాస్టర్) సాఫ్ట్‌వేర్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : కోర్టు ఉత్తర్వులు ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా వేగంగా, సురక్షితంగా చేరేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్