Skip to main content

PMGKAY: ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజనను ఎప్పటి వరకు పొడిగించారు?

Ration

పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు ఉద్దేశించిన ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై)’ పథకాన్ని మరో ఆరు నెలలు అంటే 2022, సెప్టెంబర్‌ వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్‌ మార్చి 26న నిర్ణయం తీసుకుంది. దీంతో 80 కోట్ల మంది లబ్ధి పొందుతారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

NITI Aayog: ఎగుమతుల సన్నద్ధత జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?

పీఎంజీకేఏవై–ముఖ్యాంశాలు

  • కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే లక్ష్యంతో విధించిన లాక్‌డౌన్‌తో పేదల ఉపాధికి ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో 2020, ఏప్రిల్‌ నుంచి కేంద్రం ఈ ఉచిత రేషన్‌ పథకాన్ని ప్రారంభించింది.
  • ఈ పథకం కింద దేశవ్యాప్తంగా సుమారు 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలను అందిస్తున్నారు.
  • కుటుంబంలోని ప్రతీ వ్యక్తికి నెలకు 5 కేజీల చొప్పున బియ్యం లేదా గోధుమలు, కుటుంబానికి కేజీ చొప్పున కందిపప్పు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్నారు.

Sharad Yadav: లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ను ఏ పార్టీలో విలీనం చేశారు?

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
2022, సెప్టెంబర్‌ వరకు ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై)ను అమలు చేయాలని నిర్ణయం 
ఎప్పుడు : జూన్‌ 30
ఎవరు : కేంద్ర కేబినెట్‌
ఎక్కడ : దేశవ్యాప్తంగా..
ఎందుకు : కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే లక్ష్యంతో విధించిన లాక్‌డౌన్‌తో పేదల ఉపాధికి ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 28 Mar 2022 12:30PM

Photo Stories