National Research Center of Excellence: కూరగాయల పరిశోధన కేంద్రానికి జాతీయ అవార్డు
Sakshi Education
ఏజీ వర్సిటీ (రాజేంద్రనగర్): శ్రీ కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని కూరగా యల పరిశోధన కేంద్రానికి జాతీయ ఉత్తమ పరిశోధన కేంద్రంగా 2023–2024 ఏడాదికి గాను అవార్డు దక్కింది.
జూన్ 25 నుంచి 27 వరకు గుజరాత్‌లోని నవసారిలో జరుగుతున్న అఖిల భారత సమన్వయ పరిశోధన పథకం (దుంప పంటలు)వార్షిక సమావేశాల్లో విశ్వ విద్యాలయం తరఫున పాల్గొన్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వీరా సురేశ్ ఈ అవార్డును అందుకున్నారు.
చదవండి: ఉద్యాన వర్సిటీ వంగడాలకు ప్రభుత్వ గుర్తింపు.. ఆ వంగడాలు ఇవే..
తమ పరిశోధన కేంద్రానికి జాతీ యస్థాయిలో ఉత్తమ కేంద్రంగా గుర్తింపు రావడంతో ఎంతో సంతోషంగా ఉందని పరిశోధన సంచాలకుడు డాక్టర్ కిరణ్‌కుమార్, దక్షిణ తెలంగాణ వ్యవసాయ వాతావరణ ప్రాంత జోనల్ హెడ్ డాక్టర్ సురేశ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూరగాయల పరిశో ధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ అనితా కుమారి, డాక్టర్ వీరా సురేశ్‌తో పాటు కేంద్రంలోని శాస్త్రవేత్తలను అభినందించారు.
Published date : 28 Jun 2024 10:19AM