NITI Aayog: ఎగుమతుల సన్నద్ధత జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
Export Preparedness Index 2021(EPI 2021): నీతీ ఆయోగ్ రూపొందించిన ఎగుమతుల సన్నద్ధత జాబితా–2021లో గుజరాత్‌కు అగ్రస్థానం లభించింది. రాష్ట్రాల ఎగుమతి సామర్థ్యం, వాటి సంసిద్ధత ఆధారంగా ఈ జాబితా తయారు చేస్తారు. వరుసగా రెండో సంవత్సర కూడా గుజరాత్ ఇందులో టాప్‌లో నిలిచింది. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హరియాణ, యూపీ, ఎంపీ, పంజాబ్, ఏపీ, తెలంగాణ నిలిచాయి. లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, లడఖ్, మేఘాలయ చివరి స్థానాల్లో ఉన్నాయి.
Sharad Yadav: లోక్‌తాంత్రిక్ జనతాదళ్‌ను ఏ పార్టీలో విలీనం చేశారు?
ఎయిర్‌లిఫ్ట్ గ్లోబల్‌తో ఎయిర్‌బస్ జట్టు
ఎయిర్‌బస్ తాజాగా ఎయిర్‌లిఫ్ట్ గ్లోబల్‌తో చేతులు కలిపింది. భారత్‌లో హెలికాప్టర్ ఎమర్జెన్సీ వైద్య సర్వీసులు (హెచ్‌ఈఎంఎస్), సంబంధిత ఎయిర్ అంబులెన్స్ సేవలను అభివృద్ధి చేసేందుకు వింగ్స్ ఇండియా–2022 సందర్భంగా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. విషమ పరిస్థితుల్లో ఉన్న పేషంట్లు, ప్రమాద బాధితులకు సత్వర వైద్యాన్ని అందుబాటులోకి తేవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడగలదని ఎయిర్‌బస్ తెలిపింది. ఒప్పందంలో భాగంగా ఎయిర్ అంబులెన్స్, అత్యవసర వైద్య సర్వీసులను అనుసంధానించేలా ఇరు సంస్థలు పైలట్ ప్రాజెక్టును రూపొందిస్తాయి.
World Peace Center: దేశంలో తొలి ప్రపంచ శాంతి కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్