World Peace Center: దేశంలో తొలి ప్రపంచ శాంతి కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది?
దేశంలో మొట్టమొదటి ’ప్రపంచ శాంతి కేంద్రం(వరల్డ్ పీస్ సెంటర్)’ హరియాణ రాష్ట్రం, గురుగ్రామ్‌లో ఏర్పాటు కానుంది. శాంతి రాయబారి, ప్రముఖ జైనచార్యులు డాక్టర్ లోకేష్‌జీ స్థాపించిన ‘అహింస విశ్వ భారతి ఆర్గనైజేషన్’ ఈ ప్రపంచ శాంతి కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఈ సెంటర్ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ విషయమై హరియాణ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు డాక్టర్ లోకేష్‌జీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలో శాంతి, సామరస్య స్థాపనకు ‘వరల్డ్ పీస్ సెంటర్’ కృషి చేస్తుంది. వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రధాన ప్రపంచ స్థాయి కేంద్రంగా ఉండనుంది.
Dredging Corporation of India: డీసీఐ డ్రెడ్జ్ బ్రహ్మపుత్రను ఎక్కడ తయారు చేయనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో మొట్టమొదటి ’ప్రపంచ శాంతి కేంద్రం(వరల్డ్ పీస్ సెంటర్)’ ఏర్పాటు కానుంది
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : అహింస విశ్వ భారతి ఆర్గనైజేషన్
ఎక్కడ : గురుగ్రామ్, హరియాణ
ఎందుకు : ప్రపంచంలో శాంతి, సామరస్య స్థాపనకు..
హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు: కర్ణాటక హైకోర్టు
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్