Dredging Corporation of India: డీసీఐ డ్రెడ్జ్ బ్రహ్మపుత్రను ఎక్కడ తయారు చేయనున్నారు?
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) చేతికి భారీ డ్రెడ్జర్ రానుంది. 12 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల ట్రెయిలింగ్ సక్షన్ హాపర్ డ్రెడ్జర్ (టీఎస్‌హెచ్‌డీ) కొనుగోలు చేయాలని డీసీఐ నిర్ణయించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుకానున్న ఈ డ్రెడ్జర్‌ను కొచ్చి షిప్‌యార్డులో నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి కొచ్చి షిప్‌యార్డుతో డీసీఐ ఒప్పందం చేసుకోనుంది. ఈ భారీ డ్రెడ్జర్‌కు ‘డీసీఐ డ్రెడ్జ్ బ్రహ్మపుత్ర’ అని నామకరణం చేశారు. ఈ తరహా భారీ డ్రెడ్జర్ ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేదు. కొత్తగా భారీ డ్రెడ్జర్లు అవసరమైన నేపథ్యంలో ఈ భారీ డ్రెడ్జర్‌ను కొనుగోలు చేయాలని డీసీఐ నిర్ణయించింది. దీని కొనుగోలుకు సుమారు రూ.వెయ్యి కోట్లు వెచ్చించనున్నారు. 1976, మార్చి 29న ఏర్పాటైన డీసీఐ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది.
Millets: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, ఐఐఎంఆర్ మధ్య కుదిరిన ఒప్పంద లక్ష్యం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : డీసీఐ డ్రెడ్జ్ బ్రహ్మపుత్రను ఎక్కడ తయారు చేయనున్నారు?
ఎప్పుడు : మార్చి 15
ఎవరు : కొచ్చి షిప్‌యార్డు
ఎక్కడ : కొచ్చి షిప్‌యార్డు, కొచ్చి, కేరళ
ఎందుకు : కొత్తగా భారీ డ్రెడ్జర్లు అవసరమైన నేపథ్యంలో..