Millets: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, ఐఐఎంఆర్ మధ్య కుదిరిన ఒప్పంద లక్ష్యం?
గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తృణధాన్య (మిల్లెట్స్) ఆధారిత జీవనోపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచా యతీరాజ్(ఎన్‌ఐఆర్‌డీ–పీఆర్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్(ఐఐఎంఆర్) సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఎంవోయూపై ఎన్‌ఐఆర్‌డీ–పీఆర్ డైరెక్టర్ జనరల్ నరేంద్రకుమార్, ఐసీఏఆర్–ఐఐఎంఆర్ డైరెక్టర్ విలాస్ ఎ టోనాపి సంతకాలు చేశారు. మిల్లెట్ ఆధారిత జీవనోపాధి అంశాలతోపాటు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల ద్వారా మిల్లెట్ ఆధారిత స్థానిక ఆహార వ్యవస్థలు, వ్యవసాయం–పోషకాహార అనుసంధానాలను ప్రోత్సహించడం ఈ ఒప్పందం ఉద్దేశం.
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఏ ఏడాదిని ప్రకటించారు?
ఒప్పందం కార్యక్రమం సందర్భంగా.. నరేంద్రకుమార్ మాట్లాడుతూ.. 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ (అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం)గా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో రెండు సంస్థల మధ్య సహకారం అవసరమని గుర్తించి ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్‌ఐఆర్‌డీ–పీఆర్, ఐసీఏఆర్–ఐఐఎంఆర్ ల ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉన్నాయి.
చదవండి: ప్రస్తుతం కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచా యతీరాజ్(ఎన్‌ఐఆర్‌డీ–పీఆర్)తో అవగాహన ఒప్పందం చేసున్న సంస్థ?
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్(ఐఐఎంఆర్)
ఎందుకు : గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తృణధాన్య (మిల్లెట్స్) ఆధారిత జీవనోపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్