Data Policy: ప్రస్తుతం కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?
ప్రభుత్వ శాఖలు, వివిధ విభాగాల డేటా బహిరంగంగా అందుబాటులో ఉంచే విధంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కసరత్తు చేస్తోంది. డేటా అందుబాటులో ఉండటం, వినియోగానికి సంబంధించి రూపొందించిన ‘‘డేటా పాలసీ’’ ముసాయిదా(భారత ప్రభుత్వ విధానం ముసాయిదా)ను ఆవిష్కరించింది. దీనిపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ముసాయిదా ప్రకారం.. వివిధ శాఖలు, డిపార్ట్‌మెంట్‌లు, అధీకృత ఏజెన్సీలకు సంబంధించిన సమాచారంతో పాటు వాటి ద్వారా ప్రభుత్వం సేకరించే డేటా కూడా బహిరంగంగా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర రైల్వే శాఖ; కమ్యూనికేషన్స్ శాఖ; ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రిగా అశ్విని వైష్ణవ్ ఉన్నారు.
ఇండియా డేటా ఆఫీస్ ఏర్పాటు ఉద్దేశం?
డేటా యాక్సెస్, షేరింగ్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు ’ఇండియా డేటా ఆఫీస్’ను ఏర్పాటు చేయాలని ముసాయిదాలో ఐటీ శాఖ ప్రతిపాదించింది. వివిధ శాఖలు, విభాగాలు, రాష్ట్రాల ప్రభుత్వాలతో ఇది సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. ఇండియా డేటా ఆఫీసర్, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల చీఫ్ డేటా ఆఫీసర్లు ఇందులో భాగంగా ఉంటారు.
చదవండి: పెగసస్‌ను కేసును ఎవరి నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ముసాయిదా డేటా పాలసీ ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ
ఎందుకు : ప్రభుత్వ శాఖలు, వివిధ విభాగాల డేటా బహిరంగంగా అందుబాటులో ఉంచే ప్రక్రియలో భాగంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్