Supreme court: పెగసస్‌ను కేసును ఎవరి నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది?
వీఐపీలపై నిఘా ఉదంతంలో సంచలనంగా మారిన ఇజ్రాయెలీ స్పైవేర్ పెగసస్ కేసులో ఫిబ్రవరి 23న జరగాల్సిన విచారణను ఫిబ్రవరి 25కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.
చదవండి: ఏమిటీ పెగసస్ సాఫ్ట్‌వేర్? దీన్ని ఏ సంస్థ తయారు చేసింది?
ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?
విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞాన కుతూహలాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా 18 కొత్త శాస్త్రీయ విజ్ఞాన ప్రదర్శనశాలలు (మ్యూజియంలు) ఏర్పాటు చేయనున్నట్లు ‘‘కేంద్ర సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి’’ ఫిబ్రవరి 22న చెప్పారు. రాబోయే 25 సంవత్సరాల్లో దేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈ మ్యూజియంలు మైలురాళ్లుగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు.
టాంజానియా రాజధాని నగరం ఏది?
సోషల్ మీడియాలో బాలీవుడ్ పాటలకు లిప్‌సింక్ (పాటకు తగ్గట్లు పెదాలు కదపడం) వీడియోలతో పాపులర్‌గా మారిన కిలి పౌల్‌ను టాంజానియాలోని భారత ఎంబసీ సత్కరించింది. కిలిని ఎంబసీలో సత్కరిస్తున్న ఫొటోలను భారత హైకమిషనర్ బినయ ప్రధాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. టాంజానియా దేశస్థుడైన కిలికి ఇన్‌స్టాలో దాదాపు 22 లక్షల మంది ఫాలోయర్లున్నారు.
యునెటైడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా..
రాజధాని: డొడొమా; కరెన్సీ: టాంజానియన్ షిల్లింగ్
ప్రస్తుత అధ్యక్షుడు: సమియా సులుహు
ప్రస్తుత ప్రధానమంత్రి: కాసిమ్ మజలివా
చదవండి: 12వ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూను ఎక్కడ నిర్వహించారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్